చిత్తూరు కుప్పం న నియోజకవర్గాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేపట్టిన ఈ-సైకిళ్ల తయారీ, పంపిణీ ద్వారా చిత్తూరు జిల్లా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. కుప్పం నియోజకవర్గంలో పంపిణీ చేసేందుకు ఈ- మెటరాడ్ అనే సంస్థ పెద్ద ఎత్తునఈ-సైకిల్స్ తయారు చేసింది. అలా తయారు చేసిన 5555 ఈ- సైకిళ్లను జిల్లా ఒకే రోజు పంపిణీ చేయడం ద్వారా చిత్తూరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నమోదు
దేశంలోని ఏ జిల్లాలోనూ ఇంత పెద్ద మొత్తంలో ఈ-సైకిల్స్ తయారు చేసి పంపిణీ చేయలేదు. 5555 ఇ-సైకిళ్ల పంపిణీని విజయవంతంగా పంపిణీ చేసి గిన్నిస్ రికార్డు సాధించిన చిత్తూరు జిల్లా అధికారులను సీఎం చంద్రబాబు శనివారం (జనవరి 31) అభినందించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు పత్రాన్ని చంద్రబాబు స్వయంగా తన చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ కు ఏర్పాటు చేసారు. కుప్పాన్ని కాలుష్య రహితంగా తీసుకున్న చర్యల్లో భాగంగా ఈ-సైకిళ్ల పంపిణీ చేపట్టినట్లు చెప్పారు.
కాగా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సైకిల్ పై రావడం విశేషం. కుప్పం శాంతిపురం మండలం శివపురంలోని తన నివాసం నుంచి తూంసీలో నిర్వహించిన ప్రజావేదిక వరకు అంటే దాదాపు 3 నియోజకవర్గాలకు పైగా చంద్రబాబు లబ్ధిదారులతో కలిసి సైకిల్ తొక్కారు.
