.webp)
ఫోన్ ట్యాపింగ్ కేసులో తాను విచారణకు హాజరు కాలేదని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సిట్ అధికారులకు సమాచారం అందించారు. రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల దృష్ట్యా తాను విచారణకు హాజరు కాలేనని, సిట్ విచారణకు హాజరు కావడానికి తనకు సమయం కావాలని ఆయన చెప్పారు. కాగా కేసీఆర్ అభ్యర్థనకు సిట్ అంగీకరించింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరయ్యేందుకు కేసీఆర్ కు మరింత సమయం అందించిన సిట్ నిర్ణయించింది. అదే సమయంలో విచారణకు హాజరు అయ్యే విషయంలో కేసీఆర్ ప్రస్తావించిన పలు న్యాయ సలహాలు నిర్ణయించింది. వారి సలహాను అనుసరించి కేసీఆర్ విచారణకు మరో తేదీ, విచారణ జరిపిన ప్రాంతం పై నిర్ణయం తీసుకుని మరోసారి ఆయనకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని అంటున్నారు.
కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో శుక్రవారం (జనవరి 30) మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల నామినేషన్‌కు తుది గడువు కూడా శుక్రవారం (జనవరి 30) కావడంతో తమ పార్టీ అభ్యర్థుల ఖరారులో తాను ఉన్నాననీ కేసీఆర్.. ఆరు పదుల వయస్సు దాటిన వృద్ధులను విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్‌కు పిలవరాదన్న నిబంధనను కేసీఆర్ ప్రస్తావించారు.
