9
.webp)
తెలంగాణ మునిసిపల్ ఎన్నికల ప్రచారానికి ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అధికార పగ్గాలు అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ, రాష్ట్రంలో జరగనున్న మునిసిపల్ ఎన్నికలలో సత్తా చాటాలన్న పట్టుదలతో ఉంది.
ఈ నేపథ్యంలోనే మునిసిపల్ ఎన్నికల ప్రచారానికి జాతీయ స్థాయి నాయకులను రంగంలోకి దింపుతోంది. తెలంగాణ మునిసిపల్ ఎన్నికల ప్రచారానికి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హాతో పాటు పార్టీ జాతీయ స్థాయి నాయకులు కూడా రానున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తెలిపారు. రాష్ట్రంలో మునిసిపల్ ప్రచారంలో భాగంగా మూడు భారీ బహిరంగ సభలు నిర్వహించారు.
ఇక తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కూడా మునిసిపాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.ఫిబ్రవరి 3న మిర్యాలగూడ, 4న జగిత్యాల, 5నచేవెళ్ల, 6న భూపాలపల్లి, 7న మెదక్, 8న నిజామాబాద్లో సీఎం ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా, మున్సిపల్ ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొదటి రోజు గురువారం (జనవరి 28) 890 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు.