జనవరి 13, 2026 8:35AMన పోస్ట్ చేయబడింది
.webp)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తన సొంత గ్రామం నారావారి పల్లెకు చేరుకున్నారు. కుటుంబ సమేతంగా ఆయన నాలుగు రోజుల పాటు స్వగ్రామంలోనే ఉంటారు. పండగైనా, పబ్బమైనా చంద్రబాబుకు ప్రజా సమస్యలపైనే దృష్టి ఉంటుందన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రగతి అడుగులు నెమ్మదించకూడదన్న పట్టుదల ఉంది. అందుకే వారు పండుగకు సొంత ఊరు వెళ్లే సమయంలో కూడా సూర్యలంక బీచ్ ను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. సూర్యలంక బీచ్‌ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు స్వదేశీ దర్శనం 2.0 కింద 97 కోట్ల రూపాయాన్ని కేంద్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఈ నిధులతో చేప’ట్టిన షాపింగ్ స్ట్రీట్, పార్కింగ్ పండుగ సౌకర్యాలు, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ బిల్డింగ్ కార్యక్రమాలకు తన సొంత గ్రామం వెళ్లడానికి ముందు తన కుమారుడు లోకేష్, మంత్రి తో కలిసి ఏరియల్ చేశారు. తిరుపతి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నారా వారి పల్లెకు సూర్యలంక బీచ్ చేస్తూ పరిశీలించారు. పనుల ప్రణాళికపై అక్కడికక్కడే అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుని దిశానిర్దేశం చేశారు. ఇక పండుగ సందర్భంగా సొంత ఊరు నారావారి పల్లెలోనే చంద్రబాబు బస చేయనున్నారు. సోమవారం (జనవరి 11) నారావారి పల్లెకు చేరుకున్న చంద్రబాబు మంగళవారం (జనవరి 12) గ్రామంలోని అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలలో జరుగుతాయి.
ఉదయం 8 గంటలకు గ్రామంలోని టీటీడీ కళ్యాణ మండపం ప్రాంగణంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఉంటుంది. ఆ తరువాత శేషాచల లింగేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్లారు. రూ.70 లక్షలతో ఎ-రంగంపేట–భీమవరం రోడ్డు నుంచి శేషాచల లింగేశ్వర స్వామి ఆలయం వరకు నిర్మించిన రహదారి. ఆ తరువాత కూడా ఆయన కనుమ పండుగ రోజు వరకూ పండుగ సంబరాలతో పాటు పాలనా వ్యవహారాలను కూడా నారావారి పల్లె నుంచే సాగిస్తారు. ఇక నారావారి పల్లెలో నారా వారి కుటుంబ సంక్రాంతి సంబరాలలో నందమూరి బాలకృష్ణ కుటుంబం కూడా పాల్గొననుంది.
