7
పోస్ట్ చేయబడింది జనవరి 3, 2026 7:05PM

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతం నుంచి జింక బయటకు వచ్చింది. గచ్చిబౌలి-లింగంపల్లి పాత ముంబై జాతీయ రహదారిపైకి రావడంతో కారును జింక ఢీకొట్టింది. వెంటనే సమాచారం అందుకున్న హెచ్సీయూ యానిమల్ ప్రొటెక్షన్ టీం అక్కడికి చేరుకుంది. అనంతరం, జింకను వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి.
జింక ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సంబంధిత ప్రాంతాలకు సమీపంలో ఉన్న వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సెంట్రల్ యూనివర్సిటీ ఫారెస్ట్ ప్రాంతం నుండి బయటకు వచ్చిన ఒక జింక రోడ్డుపైకి అకస్మాత్తుగా రావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో జింకకు గాయాలైనట్లు తెలిసింది.
