ఔటర్ లోపల కాలుష్యాన్ని ‘క్యూర్’ చేయాల్సిందే
ఆర్ఆర్ఆర్ వరకు రెండో అర్బన్ రీజియన్‌గా ‘ప్యూర్’
ఆవల నుంచి తెలంగాణ సరిహద్దు వరకు ‘రేర్’
మీడియాతో వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
అంతకుముందు రైజింగ్ 2047 డాక్యుమెంట్‌పై సమీక్ష
హైదరాబాద్, నవంబర్ 30 (ఈవార్తలు): రాష్ట్ర భవిష్యత్తు కోసం ‘తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్’ రూపొందించామని.. అందులో భాగంగానే రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్.. అంటూ మూడు భాగాలుగా విభజించామని రేవంత్ తెలిపారు. అంతకుముందు ఆయన ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, నిర్మాతలు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తమ ప్రభుత్వం ప్రజా పాలనలో రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, ఉత్సవాలకే పరిమితం కాకుండా, భవిష్యత్ పాలసీ డాక్యుమెంట్‌ను రాష్ట్ర ప్రజలకు అంకితం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ డాక్యుమెంట్‌కు ‘రైజింగ్ 2047’గా నామకరణం చేశామని ఆయన చెప్పారు. ఈ ప్రణాళికలో సహకరించిన ప్రతి ఒక్కరికీ సీఎం కృతజ్ఞతలు తెలిపారు. గతాన్ని అనుభవంగా తీసుకుని, ఆ అనుభవాల నుండి పాఠాలు నేర్చుకుంటూనే భవిష్యత్‌కు అడుగులు వేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పాలసీలలో పెరల్స్ వస్తే రాష్ట్ర భవిష్యత్ తీవ్రంగా నష్టపోతుందని ఆయన హెచ్చరించారు. ఈ పాలసీ డాక్యుమెంట్ తయారీలో భాగంగా, తాము ఐఎస్బీ (ISB), నీతి ఆయోగ్ వంటి ప్రముఖ సంస్థల సలహాలు కూడా తీసుకున్నట్లు. విజన్‌లో భాగమే స్ట్రాటజీ అని, ఆ స్ట్రాటజీలో భాగంగానే తెలంగాణను మూడు ప్రధాన ఆర్థిక విభాగాలుగా వర్గీకరించామని సీఎం వివరించారు.
మూడు భాగాలివే..
క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ): ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతం అంతా కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీగా పరిగణించబడుతుందని సీఎం చెప్పారు. గతంలో ఔటర్ లోపలి భాగంలో ఉన్న నాలుగు విభాగాల గందరగోళం తొలగిపోతుంది, కాలుష్య రహిత నగరంగా ఉండాలంటే ఈ ప్రాంతాన్ని ‘క్యూర్’ చేయాల్సిందేనని వివరించబడింది.
ప్యూర్ (పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ): ఔటర్ రింగ్ రోడ్డు బయటి నుండి ఆర్ఆర్ఆర్ వరకు ఉన్న ప్రాంతాన్ని పెరి-అర్బన్ రీజియన్ ఎకానమీగా పేర్కొన్నారు. 360 కి.మీ. పొడవైన ఆర్ఆర్ఆర్కు కేంద్రం అంగీకారం తెలిపిందని, ఇది నగరానికి రెండో అర్బన్ రీజియన్‌గా మారుతుందని అన్నారు. ఈ ప్రాంతంలో గ్రీన్‌ఫీల్డ్ హైవేలతో పాటు, బుల్లెట్ ట్రైన్ వేయడానికి కేంద్రం నుండి అనుమతి తెచ్చామని, హైదరాబాద్-బెంగుళూరు మధ్య కనెక్టివిటీని పెంచి అభివృద్ధిని సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
రేర్ (రూరల్ అగ్రికల్చరల్ రీజియన్ ఎకానమీ): ఆర్ఆర్ఆర్ బయటి నుండి తెలంగాణ సరిహద్దు వరకు ఉన్న ప్రాంతాన్ని రూరల్ అగ్రికల్చరల్ రీజియన్ ఎకానమీగా పేర్కొన్నారు.
ఆదాయం-సంక్షేమం, విద్యా వ్యవస్థ ప్రక్షాళన:
‘ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని సీఎం స్పష్టం చేశారు. మనకు ఆహార సమస్య లేకపోయినా, పోషకాహార (న్యూట్రీషియన్) సమస్య ఉందని, దాన్ని ఎలా పరిష్కరించాలని, దానిపై దృష్టి సారిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థకు చేరుకోవడం, ఇప్పుడు నాణ్యమైన విద్య, సాంకేతిక విద్య అందించడంపై దృష్టి పెట్టామని, విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. తెలంగాణను ‘నాలెడ్జ్ హబ్’గా మారిస్తే, పెట్టుబడులు, కంపెనీలు క్యూ కడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అదనంగా, ఎయిర్‌పోర్టుల విస్తరణలో భాగంగా వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెం, రామగుండంలో కొత్త ఎయిర్‌పోర్టులు తెస్తున్నామని సీఎం ప్రకటించారు.
క్రీడలతో చదువులో చురుకు: సైనానెహ్వాల్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్
