డిసెంబర్ 30, 2025 8:52AMన పోస్ట్ చేయబడింది

హైదరాబాద్ మహానగరంలో పోలీస్ పరిపాలనను మరింత పటిష్టంగా, సమర్ధవంతంగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న మూడు కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరిస్తూ నాలుగు కమిషనరేట్లను ఏర్పాటు చేసింది. అంటే ప్రస్తుతం ఉన్న మూడు కమిషనరేట్లకు అదనంగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసింది. ఇక నుంచి హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్ గిరి, ప్యూచర్ షిటీగా నాలుగు కమిషనరేట్లు ఉన్నాయి. ఈ మేరకు సోమవారం (డిసెంబర్ 29) రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే అదే సమయంలో యాదాద్రి భువనగిరి జిల్లాకు ప్రత్యేక పోలీస్ యూనిట్‌ను ఏర్పాటు చేసి ఎస్పీని నియమించింది.
షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ కమిషనరేట్ తాజా అసెంబ్లీ, సెక్రటేట్, నగర వాణిజ్య కేంద్రంగా ఉన్న బేగంపేట, అంతర్జాతీయ రవాణాకు ముఖ్యమైన శంషాబాద్ ఎయిర్‌పోర్టు, న్యాయానికి కేంద్రంగా ఉన్న బుద్వేల్ హైకోర్టు వంటి అత్యంత కీలకమైన ప్రాంతాలు వచ్చాయి. ఈ ప్రాంతాల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, చట్ట పరిరక్షణ మరింత పటిష్టంగా మారనుంది.
ఇక సైబరాబాద్ కమిషనరేట్‌కు ఐటీ, పారిశ్రామిక హబ్‌లు, ఐటీ కారిడార్ ప్రాంతాలైన బౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్‌రామ్‌గూడ, మాదాపూర్, రాయదుర్గలు వచ్చాయి. అలాగే పరిశ్రమల కేంద్రాలైన పఠాన్ చెరు, జీనోమ్ వ్యాలీ, ఆర్సీ పురం, అమీన్ వంటి ప్రాంతా లను కూడా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి తీసుకువచ్చారు. ఐటీ ఉద్యోగులు, అందజేసే సంస్థలు ఉన్న నేపథ్యంలో ప్రత్యేక భద్రతా కార్యకలాపాలు నిర్వహించాల్సిన అధికారులు.
ఇక రాచకొండ కమిషనరేట్ పునర్ వ్యవస్థీకరించి దాని పేరును మల్కాజ్ గిరి కమిషనరేట్ గా మార్చారు. మొదట మహంకాళి లేదా లష్కర్ కమిషనరేట్ అన్న పేరును తీవ్రంగా పరిశీలించిన ప్రభుత్వం చివరకు మల్కాజ్ గిరి కమిషనరేట్ గా నిర్ణయించింది. ఈ కమిషనరేట్ పరిధిలో కీసర, శామీర్‌పేట, కుత్భుల్లాపూర్, కొంపల్లితో పాటు ఉత్తర హైదరాబాద్‌కు చెందిన పలు ప్రాంతాలు చేరనున్నాయి. వేగంగా పెరుగుతున్న నివాస ప్రాంతాలకు అనుగుణంగా పోలీస్‌లను మరింత దగ్గరగా తీసుకురావడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు.
ఇలా ఉంటే భవిష్యత్ లో అభివృద్ధి కేంద్రంగా మారనున్న ప్రాంతాలకు ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఈ కమిషనరేట్ పరిధిలోకి చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాలు వచ్చాయి. భవిష్యత్‌లో పెద్ద ఎత్తున పారిశ్రామిక, వాణిజ్య, నివాస అభివృద్ధి జరగనున్న నేపథ్యంలో ముందస్తు భద్రతా ప్రణాళికగా ఈ కమిషనరేట్ ఏర్పాటు చేసింది.
ఇక పోతే యాదాద్రి భువనగిరి జిల్లాను ప్రత్యేక పోలీస్ యూనిట్‌గా ఏర్పాటు చేసి, అక్కడ ప్రత్యేకంగా ఎస్పీని నియమించింది. ఆలయ ప్రాంతం ఉండటం, ప్రజా రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రత్యేక భద్రతా వ్యవస్థ అవసరమన్న భావనతో ఈ నిర్ణయం తీసుకుంది.
