ప్రముఖ నటి సమంత 2026 సంవత్సరంలో స్పష్టమైన లక్ష్యాలతో అడుగుపెట్టనున్నారు. ఇటీవలే దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న ఆమె, కొత్త ఏడాదికి సంబంధించిన తన తీర్మానాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. జీవితంలో వేగం తగ్గించి, వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో లోతైన, అర్థవంతమైన బంధాలను నిర్మించుకోవడంపై దృష్టి పెట్టడం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో నవ్వుతూ ఉన్న ఒక ఫోటోను పంచుకుంటూ, తన కొత్త ఏడాది లక్ష్యాల జాబితాను బయటపెట్టారు. “2026లో నేను.. కృతజ్ఞత, లోతైన బంధాలు, ప్రశాంతమైన పని, స్థిరమైన ఎదుగుదల, లక్ష్యానికి అనుగుణంగా నడవడం” వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వబడింది. డిసెంబర్ 1న కోయంబత్తూర్‌లోని ఈశా ఫౌండేషన్‌లో రాజ్ నిడిమోరుతో సమంత వివాహం అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. వివాహం అనంతరం ఈ జంట ఇటీవల ముంబైలో తొలిసారిగా జంటగా కనిపించారు.
క్రీడలతో చదువులో చురుకు: సైనానెహ్వాల్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్
