సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ధ్వజం
హైదరాబాద్, డిసెంబర్ 1 (ఈవార్తలు): ‘నీది ప్రజాపాలనా?.. తెలంగాణ ద్రోహుల పాలన’ అని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ శాఖలో మొత్తంగా తెలంగాణ ద్రోహులనే నియమిం చింది. ఆ పోస్టులకు తెలంగాణలో సమర్థవంతమైన అధికారులే మీకు దొరకడం లేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ పోరాడి స్థానికులకు 95 శాతం రిజర్వేషన్లు సాధించారని హరీశ్‌రావు గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ శాఖలోని పై పోస్టుల్లో ఆంధ్రావాళ్లనే నియమించారని చెప్పారు. జెన్కో హైడల్ అండ్ థర్మల్ డైరెక్టర్‌గా రాజశేఖర్ రెడ్డిని తీసుకున్నారని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి సింగరేణిలో పనిచేసి రిటైర్ అయ్యాడని.. ఆయనకు విద్యుత్ ఉత్పత్తిలో ఎలాంటి అనుభవం లేదని చెప్పారు. జెన్కో సంస్థలో తెలంగాణ ఉద్యమాన్ని సమైక్యవాది కుమార్ రాజా అవమానిస్తే.. విద్యుత్ ఉద్యోగులను తరిమితరిమి కొట్టారని తెలిపారు. అలాంటి రాజాను తీసుకొచ్చారు నేడు విద్యుత్ ఉద్యోగుల మీద పెత్తనం డైరెక్టర్‌గా నియమించారని కుమార్. ఇది ప్రజాపాలనా? తెలంగాణ ద్రోహుల పాలనా? అని ప్రశ్నించారు. మధ్యప్రదేశ్‌లో మైనింగ్ ఇంజనీ’గా పనిచేసిన ఆంధ్రా పొందిన శివాజీని ఎస్పీడీసీఎల్లో కీలకమైన పోస్టులో నియమించారని హరీశ్‌రావు తెలిపారు. అనుభవజ్ఞులైన ఐదారుగురు దళిత రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు ఉన్నా ఇవ్వలేదని. తెలంగాణ గడ్డపై పనిచేయని ఏపీ వ్యక్తి నర్సింహులును ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌గా పెట్టారని తెలిపారు. రెడ్కో సీఎండీగా ఆంధ్రా స్థాపించిన జూనియర్ మోస్ట్ డీఈ వావిలాల అనీలను నియమించారని అన్నారు. తెలంగాణలో సమర్థవంతమైన అధికారులు మీకు దొరకడం లేదా అని సీఎం రేవంత్ రెడ్డిని హరీశ్‌రావు ప్రశ్నించారు. అనేకమంది తెలంగాణ దళితబిడ్డలు సమర్థులైన అధికారులు ఉన్నారని అన్నారు. ఇక్కడ ప్రభుత్వం తెలంగాణ వాళ్లు నడుపుతున్నారా? ఆంధ్రా పాలకులు నడుస్తున్నారా అని ప్రశ్నించారు. చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్గా అవినీతిపరుడైన ఆంధ్రా వ్యక్తిని నియమించారని అన్నారు. అతను గ్రీన్ ఎనర్జీ అప్లికేషన్ ఫీజు రూ.25వేల చొప్పున రూ.600 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఆఫీసు మెగావాట్‌కు రూ.25లక్షలు అడిగారని తెలిపారు. పైవాళ్లకు కూడా అందించారు రూ.30 లక్షలకు రేటు పెంచారని అన్నారు. ఇంకా లంచాల లెక్కతేలక ఆర్నెల్ల నుంచి పెండింగ్‌లో పెట్టారని అన్నారు. దరఖాస్తు చేసుకున్న వారు ఎట్రిసిటీ స్పెక్టర్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు. ఆంధ్రా అధికారులను తొలగించి తెలంగాణ వాళ్లకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
క్రీడలతో చదువులో చురుకు: సైనానెహ్వాల్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్
