బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహం నేడు 53వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. యాక్షన్ చిత్రాలకు చిరునామాగా నిలిచే ఆయన, కండలు తిరిగిన శరీరంతో యువతకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తూ ఉంటారు. అయితే, ఈ ఫిజిక్ ఒక్కరోజులో వచ్చింది కాదని, దాని వెనుక ఏళ్ల తరబడి పక్కా ప్రణాళిక, కఠినమైన క్రమశిక్షణ ఉందని ఆయన స్పష్టం చేశారు. జాన్ ఫిట్‌నెస్‌లో 60 ప్రాధాన్యత ఆహారానిదే. మిగిలిన 40 శాతం మాత్రమే వర్కౌట్‌కు ఇస్తానని చెబుతారు. ఎంత ఉన్నా అల్పాహారం మానకూడదని, గుడ్లు, పండ్లు వంటి పోషకాహారంతో రోజుని ప్రారంభించాలని సూచిస్తున్నారు. రోజంతా చిన్న చిన్న మీల్స్ తీసుకోవడం వల్ల మెటబలిజం చురుగ్గా ఉంటుందని అంటారు. ఖరీదైన డైట్ ప్లాన్ల కన్నా, మనం తీసుకునే ఆహారంలో పోషక విలువలు చూసుకోవడం ముఖ్యమని ఆయన నమ్మకం. అన్నం, బ్రెడ్ వంటి కార్బోహైడ్రేట్లను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు, వాటిని ఉదయం లేదా మధ్యాహ్నం పరిశీలిస్తారు. సెట్లో గులాబ్ జామూన్, సమోసాలను కూడా పక్కనపెట్టిన సందర్భాలున్నాయని, స్వీట్స్‌పై నియంత్రణ చాలా అవసరమని జాన్ అంటారు.
క్రీడలతో చదువులో చురుకు: సైనానెహ్వాల్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్
