ప్రముఖ సినీ నటి శ్రీల సోషల్ మీడియా వేదికగా ఓ భావోద్వేగానికి విజ్ఞప్తి చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐఐ) సాయంతో సృష్టిస్తున్న అసభ్యకరమైన, నిరాధారమైన కంటెంట్‌ను దయచేసి ఎవరూ ప్రోత్సహించవద్దని చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఆమె ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. “టెక్నాలజీని వినియోగించుకోవడానికి, దుర్వినియోగం చేయడానికి చాలా తేడా ఉంది. సాంకేతికత జీవితాన్ని సులభతరం చేయడానికి చాలా తేడా ఉంది, కానీ, కట్టడం చేయకూడదని నేను భావిస్తున్నాను” అని శ్రీలీల తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ రంగంలో ఉన్న ప్రతీ అమ్మాయి ఎవరో ఒకరికి కూతురు, సోదరి, స్నేహితురాలు అని గుర్తుంచుకోవాలని అన్నారు. తాము సురక్షితమైన వాతావరణంలో ఉన్నామనే భరోసాతోనే చిత్ర పరిశ్రమలో పనిచేయాలని కోరుకుంటున్నాము. తన పని ఒత్తిడి, షెడ్యూల్ కారణంగా ఆన్లైన్లో జరుగుతున్న చాలా విషయాలు తన దృష్టికి రాలేదని, శ్రేయోభిలాషులు చెప్పడంతోనే ఈ విషయం తెలిసిందని శ్రీలీల వివరించారు. ఫేక్ కంటెంట్ పరిణామం తనను తీవ్రంగా కలచివేసిందని, మానసికంగా కుంగదీసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనలాగే తోటి నటీనటులు కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని, అందరి కోసం తాను మాట్లాడుతున్నానని అన్నారు. ఈ వ్యవహారాన్ని ఇకపై అధికారులు చూసుకుంటారని ఆమె స్పష్టం చేశారు. గత అక్టోబర్‌లో మరో ప్రముఖ నటి ప్రియాంక అరుళ్ మోహన్ కూడా తనపై వచ్చిన ఏఐ ఫేక్ ఫోటోల గురించి ఇదే విధంగా స్పందించారు. ఏఐని తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడానికి కాకుండా, సృజనాత్మకతకు వాడాలని ఆమె కోరిన విషయం.
క్రీడలతో చదువులో చురుకు: సైనానెహ్వాల్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్
