బాలీవుడ్ నటుడు, రియల్ హీరోగా పేరొందిన సోనూ సూద్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్న 500 మంది మహిళలకు చికిత్స అందించారు. తన ఫౌండేషన్ ద్వారా ఈ చికిత్సలకు అయిన ఖర్చును భరించామని సోనూ సూద్ చెప్పారు. ఇది ప్రారంభమేనని భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపడతామని వివరించారు. మహిళలకు రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించడంపై మరింత దృష్టిసారించినట్లు సోనూ సూద్ సూచించారు. ‘రొమ్ము క్యాన్సర్ బాధిత మహిళలు 500 మందిని మేం కాపాడగలిగాం. శస్త్ర చికిత్సతో వారందరికీ కొత్త జీవితం లభించింది. 500 కుటుంబాల్లో ఆనందం నింపినందుకు సంతోషంగా ఉంది. సమష్టి కృషితోనే ఇలాంటి గొప్ప పనులు జరుగుతాయి’ అని సోనూసూద్ అన్నారు. కాగా, సమయంలోనూ సోనూ సూద్ పలు దాతృత్వ కార్యక్రమాలు చేసిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కాలంలో వలస కూలీలను సొంత ఖర్చులతో ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి మరీ స్వస్థలాలకు పంపించి ఆయన రియల్ హీరో అనిపించుకున్నారు.
క్రీడలతో చదువులో చురుకు: సైనానెహ్వాల్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్
