శ్రీలంక పేసర్, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మాజీ స్టార్ బౌలర్ మతీశ పతిరణ తన పాత ఫ్రాంచైజీకి భావోద్వేగ వీడ్కోలు పలికాడు. ఐపీఎల్ 2026 వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) అతడిని రూ. 18 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎస్కే యాజమాన్యానికి, అభిమానులకు, ముఖ్యంగా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కృతజ్ఞతలు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. గత కొన్ని సీజన్లుగా సీఎస్కే బౌలింగ్‌కు వెన్నెముకగా నిలిచిన పతిరణ, 2023లో జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, గత సీజన్లో ఫామ్ కోల్పోవడం, గాయాల బారిన పడడంతో సీఎస్కే అతడిని వేలానికి వదిలేసింది. వేలంలో ఢిల్లీ, లక్నో తీవ్రంగా పోటీపడినా చివరకు కేకేఆర్ ధరకు దక్కించుకుంది. సీఎస్కే నాలుగు సీజన్లలో 32 మ్యాచ్‌లు ఆడిన పతిరణ, మొత్తం 47 వికెట్లు పడగొట్టాడు. ఈ సందర్భంగా తన పోస్ట్‌లో “సీఎస్కే నాకు క్రికెట్‌ను ఎక్కువ ఇచ్చింది. నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఓ కుటుంబాన్ని అందించింది. నా చివరి సీజన్‌ను ఘనంగా ముగించి, ఫ్రాంచైజీ సంస్థ 50 వికెట్ల మైలురాయిని అందుకోవాలని చాలా ఆశపడ్డాను. కానీ, దురదృష్టవశాత్తు అది జరగలేదు” అని ఆవేదన వ్యక్తం చేశారు. “నాపై నమ్మకం ఉంచిన ధోనీ భాయ్‌కు, కాశీ సర్‌కు, యాజమాన్యానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. చెన్నై నా ఇల్లు లాంటిది. నా సోదరులలాంటి సహచరులకు, కష్టసుఖాల్లో నాకు అండగా నిలిచిన అభిమానులకు నా ప్రేమ ఎప్పుడూ ఉంటుంది. చెన్నైకి నా హృదయంలో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. గౌరవంతో, కృతజ్ఞతతో ఈ పోస్ట్‌ను ముగించాడు..
క్రీడలతో చదువులో చురుకు: సైనానెహ్వాల్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్
