నిన్న కోహ్లీ.. నేడు బుమ్రాటీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సహనం కోల్పోయాడు. ఓ అభిమాని అత్యుత్సాహంతో జస్ప్రీత్ బుమ్రాకు కోపం తెప్పించాడు. అనుమతి లేకుండా సెల్ఫీ వీడియో తీయడంతో చికాకు గురైన బుమ్రా అతని ఫోన్ లాగిపడేసాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. బుమ్రాతో పాటు అభిమానిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎయిర్‌పోర్ట్‌లో బుమ్రాను చేసిన ఓ అభిమాని అతని అనుమతి లేకుండా సెల్ఫీ వీడియో తీసాడు. ఇది గమనించిన బుమ్రా వద్దని హెచ్చరించాడు. అయినా ఆ అభిమాని పట్టించుకోకుండా సెల్ఫీ తీసాడు. దాంతో తీవ్ర అసహనానికి గురైన బుమ్రా ఫోన్ లాక్కున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేదానిపై క్లారిటీ లేదు. అయితే ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బుమ్రాకు అంత కోపం ఎందుకు కొందరంటే మరికొందరు మాత్రం అభిమానిని తిడుతున్నారు. బుమ్రాను చూసిన ఆ ఆనందంలో ఆ అభిమాని అలా చేశాడని, దానికే అంతా సీరియస్ అవ్వాల్సిన అవసరం ఏం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఫ్యాన్స్‌పై కోప్పడుతున్నారు!
4
previous post
