చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పే సమయం ఆసన్నమైందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఐపీఎల్ 2026 మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ వ్యవహరించిన తీరు ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్ కోసం ధోనీని సీఎస్కే రిటైన్ చేసుకున్నా.. అతను ఈ సీజన్ మధ్యలోనే వైదొలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీజన్ మొత్తం ఆడినా.. అతను బ్యాటింగ్‌కే పరిమితం అవుతాడని ఎస్ఐఎస్కే భాగస్వామ్యమైంది. ఎస్ఎస్కే ఉన్న క్రేజ్ పడిపోవద్దనే ధోనీని జట్టులో కొనసాగుతున్నారనే అభిప్రాయం ఉంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ కూడా ధోనీకి ప్రత్యామ్నాయాన్ని సిద్దం చేస్తోంది. ఇప్పటికే సంజూ శాంసన్‌ను ట్రేడ్ చేసుకున్న సీఎస్కే అతని కోసం రవీంద్ర జడేజాతో పాటు సామ్ కరణ్‌ను కూడా వదులుకుంది. రూ.18 కోట్ల భారీ ధరతో జట్టులోకి తెచ్చుకుంది. ఇక వేలంలో అనామక వికెట్ కీపర్ కార్తీక్ శర్మపై కోట్లు కురిపించింది. ఇతర ఫ్రాంచైజీలతో తీవ్రంగా పోటీపడి 14.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. సంజూ శాంసన్‌తో పాటు కార్తీక్ శర్మ కోసమే సీఎస్కే రూ.32.20 కోట్లు ఖర్చు చేయడం. ధోనీకి ప్రత్యామ్నాయ వికెట్ కీపర్‌ను తయారు చేయాలనే ఉద్దేశ్యంతోనే సీఎస్కే ఇంతలా ఖర్చు పెట్టిందని క్రికెట్ విశ్లేషకులు.
ధోనీకి ప్రత్యామ్నాయం విలువ 32 కోట్లు!
8
previous post
