ఆఖరి టీ20లో ఆకాశమే హద్దు3-1తో సిరీస్ కైవసంసౌతాఫ్రికా చేతుల్లో సిరీస్ ఓడిన భారత జట్టు, ప్రతీకారం తీర్చుకుంది. వన్డే సిరీస్‌ని 2-1 తేడాతో గెలిచిన భారత జట్టు, టీ20 సిరీస్‌ని 3-1 తేడాతో ముగించింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 30 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. 232 పరుగుల లక్ష్యఛేదనలో 20 ఓవర్లు బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు, 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేయగలిగింది.23 పరుగుల భారీ లక్ష్యఛేదనలో రీజా హెండ్రీక్స్ 13 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే క్వింటన్ డి కాక్ 35 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 65 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. డేవాల్డ్ బ్రేవిస్ 17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులతో మెరుపులు మెరిపించాడు. దీంతో 11 ఓవర్లలోనే 122 పరుగులు చేసింది సౌతాఫ్రికా. అయితే బుమ్రా, డి కాక్ని.. హార్ధిక్ పాండ్యా, బ్రేవిస్‌ని అవుట్ చేయడంతో సౌతాఫ్రికా వికెట్ల పతనం మొదలైంది. అయిడిన్ మార్క్రమ్ 6, డేవిడ్ మిల్లర్ 18, జార్జ్ లిండే 16, మార్కో జాన్సెన్ 14 పరుగులు చేయగా డినోవాన్ ఫెర్రారియాని వరుణ్ చక్రవర్తి గోల్డెన్ డకౌట్ చేశాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 4 వికెట్లు తీయగా బుమ్రాకి 2 వికెట్లు దక్కాయి. అర్ష్‌దీప్ సింగ్, హార్ధిక్ పాండ్యా చెరో వికెట్ తీశారు. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయింది 231 పరుగుల భారీ స్కోరు చేసింది. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ కలిసి తొలి వికెట్‌కి 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 21 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 34 పరుగులు చేసిన అభిషేక్ శర్మ, కార్బిన్ బాష్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఈ
పాండ్యా.. పవర్ ప్యాక్
11
previous post
