ప్రముఖ హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ కెమెరాన్ ప్రదర్శించిన చిత్రాలలో అవతార్ ప్రపంచ స్థాయి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు దీని మూడో భాగం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. శుక్రవారం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సినిమా గురించి తన అభిప్రాయాన్ని రివ్యూ రూపంలో పంచుకున్నారు టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్. ఈ స్టోరీ గురించి సుకుమార్ మాట్లాడుతూ.. ‘3.17 గంటలు నాకు క్షణాలు అయిపోయాయి. నేను పండోరా ప్రపంచానికి వెళ్ళిపోయాను. కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. తెలుగు సినిమాల్లో ఉండే ఎమోషన్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా విజువల్స్ , పాత్రలు నా మైండ్ నుంచి ఇంకా వెళ్ళలేదు. ముఖ్యంగా ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలకు నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఇది థియేటర్లలోనే చూడాల్సిన సినిమా’ అంటూ సినిమాపై అంచనాలు పెంచేశారు.
గ్రీన్ కార్డు లాటరీ నిలిపివేత
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్
