మలయాళ బ్యూటీ అనశ్వర రాజన్ డిసెంబర్ 25న విడుదల కానున్న ఛాంపియన్ అనే సినిమాలో రోషన్ మేక సరసన నటిస్తోంది. ఈ సినిమా ద్వారానే తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. అలాగే వెంకీ కుడుముల నిర్మించిన మరో తెలుగు చిత్రం ఇట్లు అర్జున అనే సినిమాలో కూడా కొత్త అనీష్ సరసన ఈమె నటించడానికి సైన్ చేసింది. ఈ రెండు తెలుగు భారీ ప్రాజెక్టులు ఈమె చేతిలో ఉండటంతో హైదరాబాదులోనే ఎక్కువ సమయం గడుపుతోంది. ఈ విధంగానే తెలుగు సినిమా పట్ల అలాగే హైదరాబాదు సంస్కృతి పట్ల తన అభిమానాన్ని పంచుకుంది. హైదరాబాద్ బిర్యానీ అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పిన ఈమె.. హైదరాబాదు రుచులను పూర్తిగా ఆస్వాదిస్తున్నాను. సెలబ్రిటీల గురించి మాట్లాడుతూ.. ‘రామ్ చరణ్ మగధీర సినిమా లెక్కలేనన్నిసార్లు చూశాను. ముఖ్యంగా తెలుగు నటులలో నాకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం’ అంటూ అనశ్వర రాజన్. ప్రస్తుతం ఈమె చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
జయహో భారత్!
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్
