బాలీవుడ్ సీనియర్ నటి మాధురిదీక్షిత్ తన కెరీర్ ప్రారంభ దశలోనే ఒక బాధాకరమైన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. 1988లో విడుదలైన ‘దయావన్’ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక ముద్దు సీన్ తనను ఎంతగా కలచివేసిందో ఆమె ఓపెన్‌గా చెప్పింది. ఆ సినిమాలో ఆమె సీనియర్ నటుడు వినోద్ ఖన్నాతో కలిసి నటించారు. అప్పట్లో మాధురీ కొత్త నటి కాగా.. వినోద్ ఖన్నా ఇండస్ట్రీలో చాలా పవర్ ఫుల్ స్టార్. ‘ఆజ్ ఫిర్ తుమ్పే ప్యార్ ఆయా హై’ అనే పాటలో ఒక రొమాంటిక్.. ముద్దు సీన్ ఉంటుంది. ఆ సినిమాలో ఆ సీన్ నాకు ఒక గుణపాఠంలా నిలిచింది. ఆ సీన్ తర్వాత నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఇకపై ఇలాంటి సన్నివేశాలు చేయకూడదని అప్పుడే నిర్ణయించుకున్నాను” అని చెప్పారు.ఆ సీన్ షూటింగ్ తర్వాత ఆమె చాలా ఎమోషనల్ అయ్యారని.. కన్నీళ్లు కూడా పెట్టుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి.
గాలి కాలుష్యం వల్ల మ్యాచ్ రద్దు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్
