చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భవిష్యత్‌పై ఇకపై ఎలాంటి అనుమానాలకు తావులేదని, ఐపీఎల్ 2026 సీజన్ తర్వాత కచ్చితంగా ఆటకు వీడ్కోలు పలుకుతాడని భారత మాజీ ఆటగాడు, ధోనీ సహచరుడు రాబిన్ ఊతప్ప చెప్పాడు. సీఎస్కే ఫ్రాంచైజీ తమ వ్యూహాన్ని పూర్తిగా మార్చుకోవడం, అనుభవజ్ఞుల కంటే యువకులపై భారీగా పెట్టుబడులు పెట్టడమే ఇందుకు నిదర్శనమని ఆయన జోడించాడు. నిన్న జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో చెన్నై ఈ పరీక్ష రుజువు చేసింది. 19 ఏళ్ల ప్రశాంత్ వీర్, 20 ఏళ్ల వికెట్ కీపర్-బ్యాటర్ కార్తీక్ శర్మ అనే ఇద్దరు యువకులను చెరో రూ. 14.2 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన భారత అన్క్యాప్డ్గా వారు నిలిచారు. ఈ పరిణామాలపై ఊతప్ప మాట్లాడుతూ.. “ఇక గోడ మీద రాత స్పష్టంగా కనిపించింది. ఇది కచ్చితంగా ధోనీకి చివరి సీజన్ అవుతుంది. మళ్లీ ఆడతాడా? లేదా? అనే ఊహాగానాలకు ఇక చోటు లేదు. ఈ ఏడాదితో అతను పూర్తిగా ఆటకు వీడ్కోలు పలుకుతాడు” అని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం 44 ఏళ్ల ధోనీ, ఆటగాడిగానే కాకుండా మెంటార్‌గా కూడా జట్టును సిద్ధం చేస్తున్నాడని ఊతప్ప అభిప్రాయపడ్డాడు. “ధోనీ ఆడకపోయినా, అతను జట్టుకు మెంటార్‌గా ఉంటాడని మనందరికీ తెలుసు. ఈ ఏడాది అతను ప్లేయర్-కమ్-మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడని నేను భావిస్తున్నాను. ఆ కోణంలోనే అతను ఆలోచిస్తున్నాడు. అందుకే ఇలాంటి ఆటగాడిని జట్టులోకి తీసుకుంటున్నాడు” అని చెప్పుకొచ్చాడు. గత కొన్ని సీజన్లుగా ధోనీ రిటైర్మెంట్పై చర్చ జరుగుతున్నప్పటికీ, అభిమానుల కోసం అతను తన కెరీర్‌ను కొనసాగిస్తూ వచ్చాడు. అయితే, యువతకు పెద్దపీట వేస్తూ సీఎస్కే తీసుకుంటున్న తాజా నిర్ణయాలు, ధోనీ శకం ముగింపునకు నాంది పలుకుతున్న క్రీడా విశ్లేషకులు.
తొలి మిస్ ఇండియా మెహర్ కాస్టలినో కన్నుమూత
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్
