9
డిసెంబర్ 18, 2025 11:22AMన పోస్ట్ చేయబడింది
.webp)
ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మావోయిస్టుల లొంగుబాట్లు, ఎన్ కౌంటర్లూ కొనసాగుతున్నాయి. తాజాగా గురువారం (డిసెంబర్ 18) తెల్లవారు జామున ఛత్తీస్ గఢ్లో జరిగిన ఎన్ కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. మరణించిన మావోయిస్టులను గుర్తించాల్సి ఉంది.
ఛత్తీస్ గఢ్ సుక్మా జిల్లా గొల్లపల్లి ప్రాంతంలో మావోయిస్టు కదలికలకు సంబంధించిన విశ్వసనీయ సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టారు. ప్రాంతంలోని పల్లెపల్లెనూ జల్లెడపట్టారు. ఈ ఎదురుపడ్డ నక్సలైట్లు పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పుల్లో ముగ్గురు మరణించారు. కూంబింగ్ ఇంకా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
