2030 కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ క్రీడలను గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్వహిస్తారు. ఇటీవల పోర్ట్ కామన్వెల్త్ స్’ సర్వసభ్య సమావేశంలో ఈమేరకు తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో క్రీడల నిర్వహణ కోసం త్వరలో ఓ ఆర్గనైజింగ్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. రూ.3,000 కోట్ల నుంచి రూ.5,000 కోట్ల వ్యయంతో ఈ గేమ్స్‌ను నిర్వహించాలని కమిటీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. మొత్తం ఖర్చు ఖరారు విషయంలో ఇంకా అంచనాలు రూపొందిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. గతంలో 2010లో న్యూఢిల్లీలో కామన్వెల్త్ క్రీడలు జరిగాయి. ఇది అనేక వివాదాల్లో చిక్కుకుంది. ప్రాథమిక సామర్థ్యం కల్పనలో జాప్యం, అవినీతి ఆరోపణలు, ప్రాథమిక అంచనాల కన్నా చాలా ఎక్కువ ఖర్చు జరగడం లేదు. ఈ క్రీడల నిర్వహణకు రూ.635 కోట్లు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. కానీ.. చివరకు రూ.2,600 కోట్లు దాటింది. ప్రాథమిక సౌకర్యాలు సహా అన్ని లెక్కల్లోకి తీసుకుంటే చాలా పెద్ద మొత్తమని తెలిసింది.
కామన్వెల్త్ గేమ్స్‌కు 5 వేల కోట్లు!?
6
previous post
