టీబీజేపీ ఎంపీలపై ప్రధాని ఆగ్రహం
ఒవైసీ టీం బాగుందంటూ ప్రశంసలు
విభేదాలు పక్కన పెట్టాలని హితవు
న్యూఢిల్లీ: తెలంగాణలో బీజేపీకి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా రాష్ట్రంలో సరైన ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదు. ఇదే సమయంలో ప్రధాని మోదీ గురువారం కుండబద్ధలు కొట్టారు. రాష్ట్రంలో బీజేపీకి ఎంపీలు ఉన్నా.. సరైన ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో పార్టీ ఎందుకు వెనుకబడిందని ఎంపీలను ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నా.. వెనకబడటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకనైనా పార్టీలో అరాంతర విబేధాలు వీడి.. సమష్టిగా పనిచేయాలని చెప్పారు. రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్ పెరిగేలా కృషి చేయాలని సూచించారు. ఈ కోరిక అసదుద్దీన్ ఒవైసీని ఉదహరించిన ప్రధాని మోదీ.. ఆయన సోషల్ మీడియా టీమ్ యాక్టివ్‌గా పనిచేస్తోందని కితాబిచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్ ఎన్డీఏ ఎంపీలతో ప్రధాని మోదీ గురువారం (డిసెంబర్ 11) అల్పాహార విందులో గడిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ.. ఎంపీల తీరు మార్చుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాల’ని చెప్పారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు పాలన బాగుందని కొనియాడారు. అందుకే ఆ రాష్ట్రానికి పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నాయన్నారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, ఆయన పార్టీ సోషల్ మీడియాలో చేస్తున్న విమర్శలకు కూడా దీటుగా కౌంటర్ అందించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో సరిసమానంగా.. బీజేపీకి ఎంపీలు ఉన్నారు. కానీ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో బీజేపీ ఎంపీలు విఫలమవుతున్నారనే విమర్శలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తున్నాయి. పార్టీ విషయంలోనూ రాష్ట్రంలోని పార్టీ పెద్దలు పెద్దగా దృష్టి పెట్టడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఎంపీలు ధర్మపురి అరవింద్, ఈటల రాజేంధర్.. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేందుకు పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల తెలంగాణ బీజేపీ వర్క్ షాప్ జరిగింది. ఇందులో ఆ పార్టీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఉన్నారు. ఈ సందర్భంగా పార్టీ కీలక నేతలతో మాట్లాడిన ఆయన.. నాయకుల మధ్య గ్యాప్ గురించి ప్రస్తావించారు. పార్టీ అధ్యక్షుడిని లైట్ తీసుకోవద్దు.. ప్రతి విషయం తనకు తెలుసునన్నారు. పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహారిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
విభూది వస్త్రం.. త్రిశూలమే అస్త్రం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్
