అఖండ-2 కు నిర్మాతలకు భారీ షాక్ తగిలింది. ఈ సినిమా ప్రియయర్ షో టికెట్ ధరల పెంపు జీవోను తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. అఖండ-2 మూవీ సినిమా టికెట్ల ధర పెంపుపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ జరిగింది. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ప్రీమియర్ షో టికెట్ ధరల జీవోను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కంపెనీ ఫిల్మ్ డెవలప్మెంట్, నిర్మాణ సంస్థకు నోటీసులిచ్చింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. అంతకుముందు.. తెలంగాణలో టికెట్ల రేట్లను భారీగా పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జీఎస్టీతో కలుపుకొని సింగిల్ స్క్రీన్లకు టికెట్‌పై రూ.50, మల్టీప్లెక్సుల్లో టికె టి ధరపై రూ.100 అదనంగా పెంచుకునే అవకాశం కల్పించింది. అలాగే గురువారం రాత్రి 8 గంటలకు ఒక ప్రత్యేక షోకు రూ.600 టికెట్ రేటుకు అనుమతులిస్తూ ప్రభుత్వం జీవోలో గుర్తింపు పొందింది. తాజాగా హైకోర్ట్ ప్రీమియర్ షో టికెట్ ధరల పెంపును సస్పెండ్ చేసింది.
శివ శివ సాంగ్ రిలీజ్
ఆ గంటల్లో థియేటర్లలో ‘అఖండ 2’ సిద్ధం కాగా, ఇందులో ‘శివ శివ..’ అంటూ సాగే ఎమోషనల్ ఆడియో సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పాటకు కల్యాణ్ చక్రవర్తి లిరిక్స్ రాయగా.. కనకవ్వ, శ్రుతి రంజనీ ఆలపించారు.
విభూది వస్త్రం.. త్రిశూలమే అస్త్రం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్
