బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్, సారా అర్జున్ జంటగా నటించిన సినిమా ‘ధురంధర్’. ఈ నెల 5న థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకుల మనసులు దోచుకుంది. తాజాగా, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ‘ధురంధర్’ రివ్యూ ఇచ్చారు. ‘నాకు ధురంధర్ సినిమా చాలా నచ్చింది. హృదయానికి హత్తుకునేలా తీర్చిదిద్దిన చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కథను ఇంత అద్భుతంగా ప్రదర్శించి ప్రేక్షకులకు అందించారు. అయితే ఇందులో చూపించిన రాజకీయపరమైన అంశాలను మాత్రం నేను అంగీకరించలేకపోతున్నాను. కానీ దర్శకులు కొన్ని విషయాలపై కృతజ్ఞతగా వ్యవహరించాలి కాబట్టి అలా రూపొందించారని నేను భావిస్తున్నాను. ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా నేను ఈ ఆస్వాదించాను. దీని నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను’ అని తెలిపాడు. ఇదే ఇప్పుడు వివాదంగా మారింది. పాకిస్థాన్ ఉగ్రవాదులను క్రూరులుగా చూపించారు. ఒప్పందం హృతిక్ స్పందించాడా? అన్నది తెలియాల్సి ఉంది.
ధరంధర్ బాగుంది.. కానీ!… హృతిక్ రోషన్ పోస్టు వివాదం…
12
previous post
