
సినిమా పేరు: అఖండ 2
తారాగణం: బాలకృష్ణ, సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, కబీర్ సింగ్, హర్షాలీ మల్హోత్రా ఛటర్జీ భర్తీ
ఎడిటర్: తమ్మిరాజు
మ్యూజిక్: థమన్
రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను
సినిమాటోగ్రాఫర్: రామ్ ప్రసాద్, సంతోష్ దేటకే
బ్యానర్స్: 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్, ఐవివై ఎంటర్ టైన్ మెంట్
నిర్మాతలు:రామ్ ఆచంట, గోపి ఆచంట, ఇషాన్ సక్సేనా
సమర్పణ: తేజస్విని నందమూరి
విడుదల తేదీ: డిసెంబర్ 12, 2025
అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఎప్పట్నుంచో కాకుండా గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య వన్ మాన్ షో ‘అఖండ 2’ ఈ రోజు ప్రీమియర్స్ తో థియేటర్స్ లో అడుగుపెట్టింది. బాలయ్య, బోయపాటి కాంబో కావడంతో పాటు బాలయ్య పాన్ ఇండియా రేంజ్ లో అడుగుపెట్టడంతో అంచనాలు హై రేంజ్ లో ఏర్పడ్డాయి. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
నటీనటులు సాంకేతిక నిపుణుల పనితీరు
అఘోర, మురళి కృష్ణ అనే రెండు డిఫరెంట్ క్యారక్టర్లలో బాలయ్య నటన మరోసారి నభూతో న భవిష్యత్తు అనే రీతిలో కొనసాగుతోంది. ముఖ్యంగా శివస్తుతుడైన అఘోర గా బాలయ్య నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తన క్యారక్టర్ యొక్క ఔచిత్యం తన కళ్ల ద్వారానే చెప్పాడు. ఫస్ట్ ఫ్రేం నుంచి చివరి ఫ్రేం దాకా థియేటర్లో కూర్చున్న ప్రతి ఒక్కరు తనలో లీనమయ్యేలా బాలయ్య నటప్రస్థానం కొనసాగుతోంది. అఘోర గా ఎన్నో కష్టతరమైన సీన్స్ ని అవలీలగా చేసి మరోసారి తనకి తానే సాటి అనిపించాడు. మురళి కృష క్యారక్టర్ లో కూడా ఎంతో హుషారుగా చేయడంతో పాటు డాన్స్ ల్లో కూడా తన స్టామినా తగ్గలేదని చాటి చెప్పాడు.. అఘోర బాబా గా జగపతి బాబు మరో సారి తాను ఎంత వాల్యుబుల్ ఆర్టిస్ట్ నో చెప్పాడు. బాలకృష్ణ కూతురుగా జనని క్యారక్టర్ లో చేసిన హర్షాలీ మల్హోత్రా తన క్యూట్ నటనతో ఆకట్టుకుంది. మరిన్ని తెలుగు సినిమాల్లో హర్షాలీ కి ఆఫర్స్ రావడం గ్యారంటీ. సంయుక్త మీనన్ మరో సారి తన నాచురల్ నటనతో ఆకట్టుకుంది. ఇక నెగిటివ్ క్యారెక్టర్ లో చేసిన అది పినిశెట్టి అద్భుతమైన పెర్ ఫార్మెన్సు తో మెప్పించడమే కాదు భయబ్రాంతులకి కూడా గురి చేసాడు. అఖండ 2 తన కెరీర్ లోనే బెస్ట్ మూవీగా నిలబడిపోయేలా చేసుకున్నాడు. మరో విలన్ కబీర్ దుహన్ సింగ్ కూడా విలనిజంతో మెప్పించాడు. ఒక కొత్త రకం డైలాగ్ మాడ్యులేషన్ ని కూడా పరిచయం చేసాడు. థమన్ తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో థియేటర్స్ లోని ప్రేక్షకులు చేస్తా శివ తాండవం చేయించాడు. ముఖ్యంగా అఘోర క్యారక్టర్ కి ఇచ్చిన బిజీఎం గురించి అయితే ఎంత చెప్పుకున్నా తక్కువే. అఘోర క్యారక్టర్ కోసం బి జి ఎం పుట్టిందా. బి జి ఎం కోసం అఘోర క్యారక్టర్ పుట్టిందా అనే రీతిలో కొనసాగుతోంది. దీన్ని బట్టి థమన్ అఖండ 2 కోసం ఎంత శివతత్వాన్ని నింపుకొని పని చేసాడో అర్ధం చేసుకోవచ్చు. 14 ప్లస్ నిర్మాణవిలువలు కూడా ఎంతో రిచ్ గా ఉన్నాయి. అఖండ 2 తో వాళ్ళ జన్మ ధన్యమైనట్టుగా కూడా భావించవచ్చు..
మరి కొద్ది సేపట్లో ఫుల్ రివ్యూ
