ఇంగ్లిష్ రాకున్నా రాష్ట్రాన్ని నడిపిస్తున్నా
గుంటూరులో చదువుకోలె.. గూడుపుఠానీ తెల్వదు
ఉస్మానియా యూనివర్సిటీ/హైదరాబాద్, డిసెంబర్ 10 (ఈవార్తలు): రేవంత్ రెడ్డి బుధవారం ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సర్వం సిద్ధం సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. తాను గుంటూరులో చదువు కోలేదని, గూడు పుఠానీ తెలియదని అన్నారు. ఆ మాటకొస్తే అగ్ర దేశాలైన చైనా, జర్మనీ, జపాన్ వాసులకు కూడా ఇంగ్లీషు రాదని చెప్పారు. ఇంగ్లిషు మాట్లాడే అమెరికా కూడా చైనాపై ఆధారపడిందని, ఒక గంటసేపు చైనా సప్లైలు ఆపితే అల్లాడిపోతుందని అన్నారు. చైనాకు అమెరికా చాలా అప్పుపడిందని, కానీ, అక్కడ ఇంగ్లీష్ మాట్లాడరని గుర్తు చేశారు. వర్సిటీలో చాలామంది విద్యార్థులు ఇంగ్లీషు రాదని బాధపడుతుంటారని, ఇంగ్లీష్ రాకపోవడం పెద్ద విషయం కాదని చెప్పారు. తాను రెండేళ్లుగా రాష్ట్రాన్ని నడిపిస్తున్నానని, కావాలంటే ఇంగ్లీషులో మాట్లాడేవాళ్లని 10 మందిని పెట్టుకొని మాట్లాడమని చెబుతానని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి రావాలని, ఆర్ట్స్ కాలేజీ ముందు విద్యార్థుల సమస్యలు తెలుసుకోవాలని అనుకున్నానని చెప్పారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చింది ఉస్మానియా యూనివర్సిటీ అని అన్నారు. ప్రత్యేక ఉద్యమ సమయంలో ఓయూ రాష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించిందని గుర్తుచేశారు. యూనివర్సిటీకి వచ్చేందుకు కావాల్సింది ధైర్యం కాదని, వర్సిటీపై అభిమానం అని చెప్పారు. అధికారులు తనకు పేపర్లు ఇచ్చి అదే మాట్లాడాలని చెప్పారని, కానీ, తన మనసులో ఏమంటే అది మాట్లాడతానని, పేపర్ చూసి మాట్లాడానని చెప్పారు. ఓయూను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చి దిద్దాలన్నదే తన సంకల్పం అని చెప్పారు.
ఓయూకు రూ.1000 కోట్లు
ఓయూ అభివృద్ధి కోసం రూ.1000 కోట్ల మేర నిధులు విడుదలయ్యాయి. ఆ వెంటనే ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ జాబితా విద్యార్థులకే అంకితం ఇవ్వబడింది. ఈ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల వర్సిటీ అభివృద్ధి కోసం రూ.45 లక్షల చెక్కును ఏర్పాటు చేశారు. భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించడానికే తాను ఇక్కడికి వచ్చానని చెప్పారు. గతంలో కొందరు ముఖ్యమంత్రులను ఓయూ స్టూడెంట్స్ అడ్డుకున్నారని అన్నారు. ఎందుకు ధైర్యం చేసి ఓయూకు వెళ్తున్నావని తనను ఎవరైనా ప్రశ్నించారని అన్నారు. తాను ఆర్ట్స్ కాలేజీ వద్దకు వచ్చింది ధైర్యం కాదని, విద్యార్థుల గుండెల్లో తన మీద ఉన్న అభిమానంతో వచ్చానని అన్నారు. దేశంలోని పురాతన విశ్వవిద్యాలయాల్లో ఉస్మానియా ఒకటి అన్నారు. ఈ వర్సిటీకి గొప్ప చరిత్ర ఉందని అభివర్ణించారు.
ప్రొఫెసర్ కాశీం భజన
సర్వం సిద్ధం సభలో ప్రొఫెసర్ కాశీం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఈ సభలో సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు, విద్యార్థులతో పాటు ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన కాశీం.. ‘సీఎం రేవంత్ రెడ్డి 25 ఏళ్ల క్రితం గీత’మ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఇటీవల మరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. విద్య అనే పేరు కలిగిన అమ్మాయిని రేవంత్ రెడ్డి ప్రేమిస్తున్నారు. అందుకే ఆయన ప్రతి ప్రసంగంలో విద్య గురించి మాట్లాడుతున్నారు. విద్యపై ప్రేమ’ను రేవంత్ రెడ్డి.. తన గొంతులో ప్రాణం ఉన్నంత వ’రకు కొన సాగించాలి’ అని. ఆయన మాట్లాడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి సైతం ‘భజన’ చేస్తున్నారన్నట్లుగా ముఖంలో భావోద్వేగాలు పలికించారు. కాశీం వ్యాఖ్యలపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువును సరస్వతి తల్లిగా కొలుస్తారని.. అలాంటిది విద్యను ఒక అమ్మాయి అనడం.. ఆమెతో సీఎం రేవంత్ రెడ్డి ప్రేమలో పడ్డాడు అనడం ప్రొఫెసర్ కాశీం భావ దారిద్ర్యని నిదర్శనమని ఘాటుగా విమర్శిస్తున్నారు.
ఎడారి దేశంలో వరదలు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్
