డిసెంబర్ 9, 2025 9:28AMన పోస్ట్ చేయబడింది

బొత్స సత్యనారాయణ.. అధికారంలో ఉన్నా, ప్రతిప క్షంలో ఉన్నాతని రాజ కీయం చేయడంలో ఆరితేరిన వారన్న పేరు ఆయనకు. విజయనగరం రాజకీయాల్లో బొత్స ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలామంది ఉన్నారు. కానీ.. ఇప్పుడు బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుత ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నార’న్న ప్రచారం సాగుతోంది. ఈ కోరికనే తాను పొలిటికల్ గా యాక్టివ్‌గా ఉన్నప్పుడే వారసుని రంగంలోకి దింపాలని భావిస్తున్నారని అంటున్నారు. తన కుమార్తె తన కుమార్తె బొత్స అనూష పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం చేస్తున్నారు.
బొత్స వారసురాలి పొలిటికల్ ఎంట్రీకి కావాల్సిన గ్రౌండ్ వర్క్ పెద్ద ఎత్తున జరుగుతోందని సూచిస్తుంది. ఇటీవల చీపురుపల్లి నియోజకవర్గ పరిధిలో వైసీపీ కార్యక్రమాల్లో అనూష చురుగ్గా పాల్గొంటున్నారు. ఆమె పొలిటికల్ గా యాక్టీవ్ అవుతున్నారనడానికి ఇదే సంకేతమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వివిధ కార్యక్రమాల పేరుతో బొత్స అనూష ప్రజల్లోకి వెళ్తున్న తీరు, అందర్నీ కలుపుకుని పోయేందుకు చొరవ చూస్తుంటే అతి త్వరలోనే ఆమె రాజకీయ ఎంట్రీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందని పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.
చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణకు ప్రత్యామ్నాయంగా అనూష ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం జరుగుతోందని సొంత కేడరే చెబుతోంది. వృత్తి పరంగా డాక్టర్ అయిన అనూష… ఇటీవల సెగ్మెంట్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు, కేడర్ మీటింగ్స్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
ధీరా ఫౌండేషన్, సత్య ఎడ్యుకేషన్‌లో డైరెక్టర్‌గా ఉన్న అనూష ప్రజలకు కావాల్సిన వైద్య సలహాలను అందించారు. అలాగే గుర్ల, మెరకముడిదాం మండలాల్లో అయితే… స్థానిక నాయకులు ఏ కార్యక్రమం నిర్వహించారు అక్కడికి తనదైన శైలిలో వెళ్లి నడిస్తున్నారట. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రెండిటిలో ఏదో ఒక మండలం నుంచి జెడ్పీటీసీగా ఆమె పోటీ చేస్తారన్న ప్రచారం. దాని ద్వారా ముందు జడ్పీ ఛైర్‌పర్సన్‌తో పొలిటికల్ కెరీర్ మొదలు పెట్టాలనుకుంటున్నారని చర్చ జరుగుతోంది.
తల్లి ఝాన్సీ తరహాలోనే అనూష కూడా రాజకీయ ఆరంగేట్రం చేస్తారని బొత్స అనుచరగణం చెబుతోంది. మరో వైపు ఇటీవలి కాలంలో అనూష పర్యటనల మీద ప్రజల స్పందన గురించి కూడా ఆరా తీశారట బొత్స సత్యనారాయణ. పాజిటివ్ రిపోర్ట్ రావడంతో… ఇప్పుడు కోరుకున్నట్లే రేపటి పరిస్థితులన్నీ అనుకూలించి తాను రాజ్యసభకు వెళితే… చీపురుపల్లి నియోజకవర్గాన్ని అనూష చూసుకునేలా స్కెచ్ రెడీ చేస్తున్నారట. అసెంబ్లీ ఎన్నికల సాధారణకు ఇంకా చాలా టైం ఉన్నందున అప్పటికి ఎలాగోలా కుమార్తె సెట్ అవుతారన్న ఆలోచనలో ఉన్నారట బొత్స. ఓవరాల్‌గా ఆ కుటుంబం నుంచి మరో రాజకీయ వారసత్వం ఖాయమైపోయిందంటున్నారు ఎమ్మెల్సీ సన్నిహితులు.
