ఏం మాట్లాడినా అబద్ధమేమాజీమంత్రి హరీశ్ రావుహైదరాబాద్, డిసెంబర్ 8 (ఈవార్తలు): రేవంత్ రెడ్డి బిల్డప్ బాబాయ్ అని, ఆయన ఏం మాట్లాడినా అబద్ధమే అంటూ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు. రెండేండ్ల పాలనలో దోపిడీ తప్ప పారదర్శకంగా లేదని, ఆత్మస్తుతి, పరనింద తప్ప రేవంత్ చేసిందేమీ లేదని తేలింది. ముఖ్యమంత్రిది ప్రైవేట్ లిమిటెడ్ పాలన అని, తన రెండేండ్ల పాలనలో చేసింది ఒక్కటైనా చెప్పగలడా అని ప్రశ్నించారు. ప్రజాభవన్‌ను జల్సాలకు, విందులు, వినోదాలకు ప్రజాభవన్‌ను కేరాఫ్‌గా మార్చారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. పార్టీ నేతలతో కలిసి రేవంత్ రెండేండ్ల పాలనపై తెలంగాణ భవన్లో హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ‘రేవంత్ పాలనలో రెండేళ్లుగా దోపిడీ తప్ప పారదర్శకత లేదు. ఆత్మస్తుతి, పరనింద తప్ప రేవంత్ రెండేండ్లలో చేసిందేమీ లేదు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీశారు. రెండేండ్ల పాలనలో రాష్ట్ర ఆదాయం ఎందుకు తగ్గింది?. ఎన్నికల హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలు చేశాం. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో తెలంగాణను నంబర్ వన్‌గా నిలబెట్టాం. ఎన్నో కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని అన్నారు. ప్రతీరోజు ప్రజల్ని కలుస్తానని రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో చెప్పారు. రేవంత్ రెడ్డి బిల్డప్ బాబాయ్. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్క రోజు మాత్రమే ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాలుగైదు రోజులు మంత్రులు వచ్చారు.. ఆ తర్వాత వాళ్లు కూడా పత్తా లేరు. దరఖాస్తులను పట్టించుకున్న నాథుడే లేడు. మేనిఫెస్టోలోని మొదటి కార్యక్రమం, రేవంత్ రెడ్డి మొదటి మాటే తుస్సుమంది. ప్రజా భవన్‌ను జల్సాలకు, విందులకు, వినోదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చారు. పొద్దుగాల బ్రేక్‌ఫాస్ట్ మీటింగులు.. మధ్యాహ్నం సెటిల్మెంట్లు.. సాయంత్రం గానా భజానాలు, సంగీత్‌లు, ఎంగేజ్మెంట్లు, విందులు వినోదాలు జరుగుతున్నాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన గొడుగు నాగరాజు అనే రైతు తనకు సమస్య ఉందని
బిల్డప్ బాబాయ్ రేవంత్
13
previous post
