చెన్నై: యువ కథానాయిక కృతి శెట్టి తనకు ఎదురైన ఓ వింత అనుభవాన్ని పంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. తాను నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి సరిగ్గా ముందు రోజు రాత్రి, తన గదిలో ఒక ఆత్మను చూసి ఆమె హోటల్ కనిపించింది. తమిళ నటుడు కార్తి హీరోగా, నలన్ కుమారస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వా వాత్తియార్’ చిత్రంలో కృతి శెట్టి నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె ఆత్మలతో మాట్లాడే ఒక యువతి పాత్రను పోషిస్తున్నారు. ఈ పాత్ర గురించి మాట్లాడుతూ, “ఈ సినిమా షూటింగ్ మొదలవడానికి ముందు రోజు రాత్రి నాకో వింత ఎదురైంది. మా అమ్మతో కలిసి హోటల్ గదిలో ఉన్నప్పుడు ఒక ఆత్మ రూపాన్ని చూశాను. మేం లైట్ వేయగానే పెద్ద శబ్దం వచ్చి అది మాయమైంది. ఆ ఆత్మ నాకు సహాయం చేయడానికి వచ్చిందో లేక పాత్ర కోసం నేను చేస్తున్న సాధన వల్ల వచ్చిందో తెలియదు” అని కృతి చెప్పింది. తనకు మొదటి నుంచి ఆత్మలపై నమ్మకం ఉందని ఆమె చెప్పారు. “నేను తుళు సంప్రదాయానికి చెందినదాన్ని. మేము మా పూర్వీకులను దేవతలుగా పూజిస్తాం. వారు ఎప్పుడూ మమ్మల్ని కాపాడుతూ ఉంటారని నమ్ముతాం. ఇప్పుడు ఈ ఘటనతో ఆ నమ్మకం మరింత బలపడింది” అని వివరించారు. ఈ అనుభవం వల్ల సినిమాలో తాను నటించిన పాత్రపై మరింత నమ్మకం ఉందని, నటనలో తనకు బాగా ఉపయోగపడిందని కృతి శెట్టి అన్నారు.
గల్వాన్‌లో యుద్ధ స్మారకం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్
