డిసెంబర్ 8, 2025 6:56PMన పోస్ట్ చేయబడింది

ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగిలిన నియోజకవర్గానికి భిన్నంగా ఉంటుంది. రాయలసీమలో ప్రత్యేకంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో వేరే నియోజకవర్గాలతో ఆ రాజకీయం ఎప్పుడు సైలెంట్‌గా ఉంటుంది. గుంతకల్ నియోజకవర్గంలో కేవలం ఒకే మండలం రెండు మున్సిపాలిటీలు మాత్రమే ఉండటంతో పెద్దగా రాజకీయ జోక్యాలు ఉండవు. గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా వివాదాలకు దూరంగా ఉన్నారు.
2014 ఎన్నికల్లో ఒకసారి టీడీపీ తరపున జితేంద్ర గౌడ్, 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున వెంకట్రామిరెడ్డి గెలిచారు.ఇద్దరు కూడా ఎక్కడ పెద్దగా వార్తల్లో నిలిచేవారు కాదు. ఇలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు తమ వారసులను ఎంట్రీ ఇచ్చేందుకు ఇద్దరు కీలక నేతలు రంగం సిద్ధం చేస్తున్నారు. 2024లో టీడీపీ నుంచి గెలిచినా గుమ్మనూరు జయరాం, వైసీపీ నేత వెంకట్రామిరెడ్డిలు ఇద్దరు ఇదే పనిలో ఉన్నారట. ఇప్పటికే దీనికి సంబంధించి గ్రౌండ్‌ను ప్రిపేర్ చేస్తున్నారట నేతలు.
అధికార టీడీపీ, విపక్ష వైసీపీలో వారసుల ఎంట్రీ త్వరలో జరగనుందని ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా టీడీపీ నుంచి గుమ్మనూరు జయరాం తనయుడు గుమ్మనూరు ఈశ్వర్ సీన్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే గుత్తి, పామిడి మండలాల్లో ఇంచార్జిగా ఉండటంతో ఈ రెండు చోట్ల తన ఫోకస్ పెంచారు. వరుస పర్యటనలు చేస్తూ క్యాడర్‌తో మమేకం అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో వైసీపీ నుంచి కూడా మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి కూతురు నైరుతి రెడ్డి గుంతకల్లు మొత్తం తన భుజస్కందాలపై వేసుకొని తండ్రికి చేదోడు వాదోడుగా వస్తున్నారు.
అయితే తండ్రి ఇటీవల అనార్యోగానికి గురవడంతో తనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ క్యాడర్లో జోష్ నింపుతున్నారు. వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా పిలుపునిచ్చారు. ఇటీవల అనంతపురం జిల్లా రాప్తాడు నేతకి పెళ్లి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నైరుతి రెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.
అందులోనూ వేరే నేత ఎవరు పోటీలో లేకపోవడం వైసీపీతో అయితే వెంకట్రామిరెడ్డి లేదంటే ఆయన కూతురు నైరుతి రెడ్డికి ఛాన్స్ ఉండే అవకాశం ఉంది.ఇక టీడీపీలో చూసుకుంటే గుమ్మనూరు జయరాం తనయుడు గుమ్మనూరు ఈశ్వర్ అంత ఈజీగా ఛాన్స్ కొట్టే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే గుమ్మనూరు జయరాం ఫోకస్ మొత్తం కర్నూల్ జిల్లా సొంత సెగ్మెంట్ ఆలూరుపై పెట్టడం.. అందులోనూ గుంతకల్లు టీడీపీలో గుమ్మనూరు జయరాం అవినీతి ఆరోపణలు రావడంతో పార్టీ పరిస్థితులు అతనికి అనుకూలంగా కనిపించడం లేదు.
అందులోనూ టీడీపీలో ఈసారి గుంతకల్ టికెట్ కోసం తీవ్రమైన పోటీ ఉండే అవకాశం ఉంది. ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ ఇదే సీటుపై కన్నేయడం, టీడీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ కూడా గుంతకల్లుపై ఫోకస్ పెంచడం, ఆయనకు అది సొంత నియోజకవర్గం కావడంతో గుమ్మనూరు ఈశ్వర్‌కు కొద్దిపాటి ఛాన్స్‌లు మాత్రమే ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. మరి వచ్చే ఎన్నికల నాటికి మరి వారసుల ఎంట్రీ ఉంటుందా లేదా అనేది చూడాలి.
