దక్షిణాఫ్రికా జట్టుపై భారత్ వన్డే సిరీస్ కైవసం చేసుకున్న అనంతరం విరాట్ స్టేడియంలో ప్రదర్శించిన హావభావాలు మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా సహచరుడు, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ఉత్సాహంగా ఆలింగనం చేసుకున్న విరాట్ కోహ్లీ.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను కేవలం కరచాలనంతోనే సరిపెట్టడం పలు అనుమానాలకు దారితీసింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ (302 పరుగులు, 2 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ) అత్యద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అయితే జట్టు విజయం తర్వాత మధ్య జరిగే సహజమైన కౌగిలింతలు, ఆత్మీయ పలకరింపుల సమయంలోనే ఈ ‘వివాదం’ వెలుగులోకి వచ్చింది. మ్యాచ్ ముగిశాక, విరాట్ కోహ్లీ జట్టు సభ్యులు, సహాయక సిబ్బందిని కలుపుతూ వచ్చాడు. సహచరందరినీ ముఖ్యంగా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను, విరాట్ నవ్వుతూ, ఉల్లాసంగా కౌగిలించుకున్నాడు. ఈ సన్నివేశాలు మధ్య సత్సంబంధాలను స్పష్టం చేశాయి. కానీ కోహ్లీ ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌ను కలుస్తున్నప్పుడు అతని హావభావాలు స్పష్టంగా మారిపోయాయి. కోహ్లీ గంభీర్‌ను కౌగిలించుకోకుండా, కేవలం కరచాలనం చేయడంతోనే సరిపెట్టాడు. ఈ వీడియోకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అభిమానులు దీన్ని చూసి గంభీర్, కోహ్లీ మధ్య మరోసారి విభేదాలు నెలకొన్నట్లు అభిప్రాయపడుతున్నారు. కోహ్లీ బాడీ లాంగ్వేజ్‌లో వచ్చిన ఈ మార్పు, హెడ్ కోచ్‌తో కోహ్లీకి ఉన్న విభేదాలనుమరోసారి బహిర్గతం చేసిందని విశ్లేషిస్తున్నారు.
గల్వాన్‌లో యుద్ధ స్మారకం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్
