డిసెంబర్ 6, 2025 11:36AMన పోస్ట్ చేయబడింది

తెలంగాణలో మద్యం విక్రయాలు అమాంతంగా పెరిగిపోయాయి. తెలంగాణలో మందుబాబులు గజగజలాడించే చలి నుంచి రక్షణ కోసం చలిమంటలు, దుప్పట్లు, రగ్గులను కాకుండా మద్యాన్ని ఆశ్రయించారని భావిస్తున్నారు. ఎందుకంటే గత నాలుగు రోజులలో రాష్ట్రంలో ఏకంగా 600 కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో అయితే ఈ అమ్మకాలు 5 కోట్ల 86 లక్షలు ఉన్నాయి. వెచ్చటి మద్యం గొంతులో పోసుకుని చలిలో తెలంగాణ మందంబాబులు ఖుషీగా ఈ గుర్తింపు తేటతెల్లం చేస్తున్నారు. గత ఏడాది ఇదే కాలంతో పొలిస్తే మద్యం విక్రయాలు ఈ ఏడు ఏకంగా 107 శాతం పెరిగాయి.
రాష్ట్రం మొత్తంగా చూస్తే ఈ నెల మొదటి తారీకు నుంచి నాలుగో తేదీ వరకూ డిసెంబర్ 1 నుంచి 4 వరకూ కేవలం నాలుగు రోజుల్లో 600 కోట్లు ఉండేందుకు గ్రామ పంచాయతీ ఎన్నికలు, కొత్త మద్యం విధానం కూడా కారణమని అధికారులు తెలిపారు. ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించింది. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ బీర్ల అమ్మకాలు కూడా జోరుగా సాగాయి. నాలుగు రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో 5.89 లక్షల కేసుల బీర్లు అమ్ముడవ్వడమే ఇందుకు నిదర్శనం. అదే గత ఏడాది ఇదే కాలంలో బీర్ల అమ్మకాలు 4.26 లక్షల కేసులు మాత్రమే.
