టాలీవుడ్ స్టార్ యాక్టర్ చిరంజీవి టైటిల్ రోల్ పాత్ర పోషిస్తున్న చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు . అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ‘పండగకు వస్తున్నారు’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తోంది. లేడీ సూపర్ స్టార్ నయనతార ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ చిత్రంలో వెంకటేష్ రోల్లో నటిస్తున్న గెస్ట్ అని తెలుస్తుంది. చిరంజీవి, వెంకటేశ్ కాంబోలో ఓ పాట కూడా షూటింగ్ కొనసాగుతుందంటూ వార్తలు కూడా వచ్చాయి. తాజాగా అధికారిక అప్డేట్ వచ్చేసింది. ఈ సాంగ్ గ్లింప్స్ షేర్ చేశారు మేకర్స్. బ్యాక్ డ్రాప్ విజువల్స్ ఫైరింగ్ మోడ్‌లో ఉండగా.. చిరు, వెంకీ కలిసి నడుస్తూ థంబ్స్ అప్ సింబల్ చూపిస్తున్న గ్లింప్స్ అభిమానుల్లో జోష్ నింపుతోంది. విక్టరీ మాస్ సాంగ్.. మెగా షూటింగ్ కొనసాగుతోంది అంటూ అనిల్ రావిపూడి టీం షేర్ చేసిన అదిరిపోయే సాంగ్ గ్లింప్స్ ఇంట్రో నెట్టింట వైరల్ అవుతూ పాటపై అంచనాలు మరింత పెంచుతున్నాయి.
చిరు, వెంకీ సాంగ్ గ్లింప్స్ అదిరింది!
7
