ఐపీఎల్ 2026 మినీ వేలానికి రంగం సిద్దమైంది. డిసెంబర్ 16న అబుదాబి వేదికగా ఈ మినీ ఆక్షన్ జరగనుంది. ఇప్పటికే రిటెన్షన్ ప్రక్రియ ముగియగా 10 జట్లలో 77 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ 77 స్థానాలకు 1355 మందిని రిజిస్టర్ చేసుకున్నారు. ఇందులో రూ.2 కోట్ల కనీస ధరతో 45 మంది ఉన్నారు. ఈ జాబితాను ఐపీఎల్ నిర్వాహకులు 10 జట్లకు అందించారు. పది ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన షార్ట్ లిస్ట్ చేయబోతున్నారు. డిసెంబర్ 5 నాటికి తమ షార్ట్ లిస్ట్ జాబితాను ఫ్రాంచైజీలు ఐపీఎల్ ఫ్రాంచైజీలకు అందజేయాల్సి ఉంటుంది. 10 ఫ్రాంచైజీల షార్ట్ లిస్ట్ జాబితా నుంచి నిర్వాహకులు తుది జాబితాను సిద్దం చేసి వేలం వేస్తారు. ప్రతీ జట్టుగా 25 మంది కనిష్టంగా 20 మందిని ఎంపిక చేసుకోనున్నాయి. ఈ 77 మందిలో విదేశీయులకు 31 స్లాట్లు ఉన్నాయి. రస్సెల్ ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించి కోచ్‌గా అవతారమెత్తగా.. డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ ఈసారి వేలానికి రిజిస్టర్ చేసుకోలేదు.
వేములవాడ ప్రైవేట్ ఆస్పత్రుల్లో డీఎంహెచ్‌వో తనిఖీ
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్
