కోల్‌కతా నైట్ రైడర్స్ దిగ్గజం, రెండు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ ఆండ్రీ రస్సెల్ ఈ లీగ్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. కేకేఆర్ అతడిని రిలీజ్ చేసిన తర్వాత ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే ఐపీఎల్ 2026లో ఆండ్రీ రస్సెల్ కోల్‌కతా నైట్ రైడర్స్ సపోర్ట్ స్టాఫ్‌లో పవర కోచ్‌గా చేరనున్నాడు. ఆండ్రీ రస్సెల్ దశాబ్దానికి పైగా కేకేఆర్‌తో అనుబంధం ఉంది. 2014, 2024లో ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైటర్ రైడర్స్ జట్టులో ఆండ్రీ రస్సెల్ కీలక సభ్యుడు. ఆండ్రీ రస్సెల్ అకస్మాత్తుగా ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో ఓ భావోద్వేగ పోస్ట్ ద్వారా అభిమానులకు వివరించాడు. ‘నేను ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు, ఇది సరైన సమయం అని భావించాను. నేను నా వెనుక ఒక గొప్ప లెగసీని వదిలి వెళ్లాలనుకుంటున్నాను’ అని రస్సెల్ పెంచాడు. రస్సెల్ రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ కేకేఆర్‌తో తన అనుబంధాన్ని కొనసాగిస్తుంది. వచ్చే సీజన్లో కేకేఆర్ పవర్ కోచ్ పాత్రలో ఉంటానని అభిమానులకు శుభవార్త అందించాడు.
ఐపీఎల్‌కు రస్సెల్ గుడ్‌బై
6
previous post
