దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ క్లోయీ ట్రయాన్ తన ప్రియురాలు, జింబాబ్వేకు చెందిన కంటెంట్ క్రియేటర్ మిచెల్ నేటివెల్‌తో నిశ్చితార్థం చేసి ప్రపంచాన్ని దృష్టిని ఆకర్షించింది. సోషల్ మీడియా ద్వారా ఈ శుభవార్తను పంచుకున్న క్లోయీ.. తాను డబ్ల్యూపీఎల్ 2026 వేలంలో ముంబై ఇండియన్స్ జట్టులో చేరిన కొద్ది రోజులకే ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. క్రీడాకారులు నిశ్చితార్థం లేదా వివాహాలు చేసుకుంటే వారి అభిమానులు సంతోషిస్తారు. కానీ క్లోయీ ట్రయాన్ ఈ ప్రకటన చేయడంతో ఆమెను ఇష్టపడే ఎంతో మంది పురుష అభిమానుల హృదయాలు బద్ధలయ్యాయి. నవంబర్ 29న క్లోయీ ట్రయాన్ ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో మిచెల్ నేటివెల్‌తో కలిసి ఉన్న అందమైన నిశ్చితార్థపు షేర్ చేసింది. క్లోయీ ట్రయాన్ మోకాలిపై కూర్చుని తన ప్రియురాలికి ఉంగరాన్ని అందించి ప్రపోజ్ చేసింది.
గర్ల్‌ఫ్రెండ్‌తో మహిళా ఆల్‌రౌండర్ ఎంగేజ్మెంట్!
7
previous post
