కలెక్టర్లకు ఎన్నికల సంఘం ఆదేశం
బ్యాలెట్ చివరలో ఉండాలని సూచన
మొత్తం 50 ఎన్నికల గుర్తులు విడుదల
సర్పంచులకు 30, వార్డు సభ్యులకు 20
హైదరాబాద్, నవంబర్ 28 (ఈవార్తలు): పంచాయతీ ఎన్నికల్లో తొలిసారిగా నోటా గుర్తును కేటాయించబోతున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఫ్రీ సింప్స్ను ప్రకటించిన ఈసీ.. బ్యాలెట్ చివరి గుర్తుగా నోటా ఉండాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు నోటిఫికేషన్ జారీ చేసింది. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల గుర్తులను విడుదల చేసింది. ఇందులో సర్పంచ్ అభ్యర్థులకు 30 మంది గుర్తులు, వార్డు సభ్యులకు 20 గుర్తులు కేటాయించారు. స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీల గుర్తుల మీద జరగవు. కాబట్టి ఎన్నికల సంఘం కొన్ని గుర్తులను (ఫ్రీ సింబల్స్) విడుదల చేస్తుంది. ఆయా పార్టీలు తమ అభ్యర్థులను నిలబెట్టేందుకు అది అనధికారికమే. ఏ పార్టీ గుర్తు ఉండదు. ఆయా పార్టీలు తమ అభ్యర్థులను ఎంచుకుని తమ ‘పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి’గా ప్రచారం చేసుకుంటారు. ఈ నేపథ్యంలో ఏ పార్టీ గుర్తులు బ్యాలెట్ పత్రంపై కనిపించవు. ఇప్పటికే మొదటి విడత నామినేషన్ ప్రక్రియ. మొదటి విడత జరిగే గ్రామ పంచాయతీల్లో వార్డు, సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తున్నారు. గ్రామాల్లో ప్రధాన పార్టీలు తమ పార్టీల అభ్యర్థులను నిలదీస్తున్నాయి. పెద్ద ఎత్తున స్వతంత్రులు బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
రెండో రోజు 4,901 నామినేషన్లు
పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వంలో రెండో రోజైన శుక్రవారం సర్పంచి పోటీకి 4,901 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండు రోజులకు కలిపి సర్పంచి స్థానాలకు 8,198 నామినేషన్లు రాగా, వార్డు సభ్యులకు 11,502 నామినేషన్లు వచ్చాయి. తొలి విడత నామినేషన్లకు శనివారంతో గడువు ముగియుండగా.. భారీ స్థాయిలో నామినేషన్లు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మొదటి విడతలో 4,236 సర్పంచి, 37,440 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.
క్రీడలతో చదువులో చురుకు: సైనానెహ్వాల్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్
