సొంతంగా పంపిణీ షిప్‌లు ఇస్తా
ఖమ్మం జిల్లాలో ఓ అభ్యర్థి ఆఫర్…..
నేలకొండపల్లి/ఖమ్మం జిల్లా, నవంబర్ 28 (ఈవార్తలు): పంచాయతీ ఏకగ్రీవానికి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే మొదటి విడత ఎన్నికలకు నామినేషన్లు నడుస్తున్నాయి. అయితే సర్పంచ్ పదవులపై కన్నేసిన ఆశావాహులు ఓటర్లకు ఆశ చూపుతున్నారు. పోటీ వద్దంటూ ఏకగ్రీవాల కోసం బేరసారాలు ఆడుతున్నారు. తాజాగా, ఖమ్మం జిల్లాకొండపల్లి మండలం ముటాపురం గ్రామానికి కిష్టారావు అనే అభ్యర్థి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. తనను గ్రామానికి సర్పంచ్ గా ఏకగ్రీవం చేస్తే కోటి రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తానని ప్రకటించాడు. అంతేగాకుండా ఊర్లోని వీరన్న సామి గుడికి ఏకంగా భూమిని విరాళం ఇస్తానని..అంటేగాకుండా పలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తానని చెప్పాడు.. విద్యార్థులకు సొంతంగా అవార్డు ఇస్తానని చెప్పాడు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే గ్రామస్థులు మాత్రం కిష్టారావు నాన్ లోకల్ అని అంటున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు.
క్రీడలతో చదువులో చురుకు: సైనానెహ్వాల్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్
