హైదరాబాద్, నవంబర్ 28 (ఈవార్తలు): ప్రజాపాలన వారోత్సవాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ప్రతి జిల్లాలో ప్రజాసభలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, అధికారులతో సమీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పర్యటన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సభ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రజాసభలు విజయవంతం కావాలన్న ఉద్దేశంతో వేదికలు, రవాణా, భద్రతా ఏర్పాట్లను చూస్తున్నట్లు సమాచారం. ప్రజాపాలనలో రెండేళ్ల సాధనను ప్రజలకు వివరించడానికి, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలను తెలియజేయడానికి ఈ సభలు ఉపయోగపడనున్నాయని పార్టీలు చెబుతున్నాయి.
సీఎం రేవంత్ పర్యటన ఇలా..
డిసెంబర్ 1న మహబూబ్ నగర్ జిల్లా మక్తల్
డిసెంబర్ 2న ఖమ్మం జిల్లా కొత్తగూడెం
డిసెంబర్ 3న కరీంనగర్ జిల్లా హుస్నాబాద్
డిసెంబర్ 4న ఆదిలాబాద్
డిసెంబర్ 5న నర్సంపేట
డిసెంబర్ 6న నల్లగొండ జిల్లా దేవరకొండ
క్రీడలతో చదువులో చురుకు: సైనానెహ్వాల్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్
