సౌతాఫ్రికాతో ఓటమి తర్వాత మేనేజ్మెంట్, సెలెక్టర్లపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతుండగా.. దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ వారికి మద్దతు తెలిపాడు. ప్రస్తుత జట్టు సంధిలో ఉన్నట్లు తెలిపారు. దాంతోనే ఆశించిన ఫలితం దక్కలేదని అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జట్టులో ఉంటే ఫలితం మరోలా ఉండేదనే వాదనను తప్పుబట్టారు. కోహ్లీ, జట్టులో ఉన్నా ఇదే ఫలితం పునరావృతమయ్యేదని చొప్పాడు. కోహ్లీ, రోహిత్, అశ్విన్ ఉండగానే న్యూజిలాండ్ చేతిలో 3-0తో క్లీన్ స్వీప్ అయిందనే గుర్తు చేశారు. ఆస్ట్రేలియా పర్యటనలో కూడా ఓడిపోయిందని చెప్పారు. ‘రిటైర్మెంట్ అనేది వారి వ్యక్తిగత నిర్ణయం. బహుషా.. టీమ్మేనేజ్మెంట్ వారి భవిష్యత్తు గురించి ఆలోచించాలని చెప్పవచ్చు. కానీ వారు జట్టులో ఉంటే భారత్ గెలిచేది అనే వాదన సరికాదు. ఎందుకంటే న్యూజిలాండ్ చేతిలో క్లీన్ స్వీప్ అయినప్పుడు వారు భారత జట్టులోనే ఉన్నారు. వారు ఉండగానే భారత్ 0-3తో చిత్తయ్యింది. ఆస్ట్రేలియా పర్యటనలోనూ సిరీస్ కోల్పోయింది. రిటైర్మెంట్ తీసుకోవాలా? అనే ఆలోచన చేయవద్దు. అది సరైన పద్దతి కూడా కాదు.’అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.
కోహ్లీ, రోహిత్ ఉన్నా.. ఓడిపోయేవాళ్లం: గవాస్కర్
2
previous post
