మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. బుచ్చి బాబు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాలు కలిసి వచ్చాయి. జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్. ఇప్పటికే పెద్ది నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ చికిరి చార్ట్ బస్టర్ గా నిలిచింది. పెద్ది రిలీజ్ కి ముందే చికిరి సాంగ్ 110 మిలియన్ వ్యూస్ తో సెన్సేషనల్ అనిపించుకుంది. పెద్ది సినిమాలో కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు. శివ రాజ్ కుమార్, చరణ్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా యాక్షన్ కొరియోగ్రఫీ కోసం బాలీవుడ్ స్టార్ స్టంట్ మాస్టర్ శ్యామ్ కౌశల్ ని తీసుకొస్తున్నారట. దంగల్ నుంచి మొన్న రిలీజైన తేరే ఇష్క్ మైన్ సినిమా వరకు శ్యామ్ కౌశల్ తన యాక్షన్ కొరియోగ్రఫీతో యాక్షన్ ప్రియులను అలరిస్తూ వచ్చారు. పెద్ది సినిమా కోసం శ్యామ్ కౌశల్ ఆధ్వర్యంలో నవకాంత్ యాక్షన్ సీన్స్ కంపోజ్ చేస్తున్నారట. ఈ యాక్షన్ సీన్స్ మూవీకే హైలెట్ అనిపించేలా ఉంటుందని టాక్.
నెక్ట్స్ లెవెల్లో పెద్ది యాక్షన్ సీన్స్..!
3
