నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘అఖండ 2’ కోసం అభిమానులు ఏ స్థాయిలో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రం డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. ఇప్పటికే ఓవర్సీస్కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే జర్మనీలో బాలకృష్ణ ఎన్ఆర్ఐ అభిమాని ఒకరు ఈ సినిమా టికెట్‌ను ఏకంగా రూ. 2 లక్షలకు కొనుగోలు చేశారు. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు చెందిన ఎన్ఆర్ఐ అభిమాని రాజశేఖర పర్నపల్లి ఈ అసాధారణమైన పనిని ప్రదర్శించారు. రెండు లక్షల రూపాయలు (రూ.2,00,000) చెల్లించి మరీ ఆయన ‘అఖండ 2’ సినిమా టికెట్‌ను కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది
వెంకటేశ్ ప్రసాద్‌కు హైకోర్టు షాక్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్
