సిరిసిల్ల, నవంబర్ 28 (ఈవార్తలు): వేములవాడ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ బీజేపీ బలం మరింత పెరిగింది. కథలాపూర్ వారి అతిపెద్ద గ్రామాలైన తండ్రియాల్, గంభీర్పూర్ నుంచి శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి చెందిన తాజా మాజీ సర్పంచ్‌లు బీజేపీలో చేరారు.తాండ్రియాల్ తాజా మాజీ సర్పంచ్, కాంగ్రెస్ ముఖ్య నాయకులు గడీల గంగా ప్రసాద్, గంభీర్పూర్ మాజీ సర్పంచ్ గుంటుక మనోహర్‌లు వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ చెన్నమనేని వికాస్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా డాక్టర్ వికాస్ మాట్లాడుతూ గ్రామాల్లో నిజమైన అభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యమవుతుందని ప్రజలు గ్రహించారని అన్నారు. బీజేపీ బలపరిచిన సర్పంచ్‌ని గెలిపించి, గ్రామాల అభివృద్ధికి కృషి చేయడానికి ప్రజలకు ఈ చేరికలు నియోజకవర్గంలో బీజేపీకి మరింత బలాన్నిచ్చాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మల్యాల మారుతి, జిల్లా ఉపాధ్యక్షులు రాచమడుగు వెంకటేశ్వరరావు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కొడిపెల్లి గోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు బద్రి సత్యం, ఆనంద్ రెడ్డి, జెలందర్, శ్రీను, తిరుపతి, గంగా మల్లయ్య, రాజేష్, మూర్తి, సాయిరెడ్డితో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. పార్టీలో చేరిన నాయకులకు వారు కండువాలు కప్పి స్వాగతం పలికారు.
పెళ్లి రద్దు వార్తలకు స్మృతి చెక్ బయోలో దిష్టి రక్ష ఎమోజీ
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్
