తెనాలి, నవంబర్ 27 (ఈవార్తలు): వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్రవ్యాఖ్యలు చేశారు. గురువారం గుంటూరు జిల్లాలో జరిగిన సేవాజ్యోతి పురస్కార ప్రదాన ఉత్సవాల్లో ఆయన పాల్గొన్న ఉచితాలు తెలిసేలా ఎవరున్నారు? అంటూ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఉచితంగా తిరుగుతూ ఉచిత పథకాలను ఉద్దేశించి బస్సు ఇవ్వండి.. అందులో మేము.. అని మహిళలు అడిగారా? అని సూటి ప్రశ్న వేశారు. మరి ప్రభుత్వాలు ఎందుకు ఇటువంటి పథకాలను తీసుకు వస్తున్నారని ప్రశ్నించారు. అభివృద్ధి రాష్ట్రం కోసం సంపదను సృష్టించే మార్గాలను చూడాలి కానీ అప్పులు చేసి ఉచిత పథకాలు ఇవ్వడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏది ఉచితంగా ఇవ్వకూడదు అనేది తన అభిప్రాయమని చెప్పారు. ఉచిత పథకాల ద్వారా ప్రజలను సోమరిపోతులను చేసి, ఆపై వారిని తాగుడుకు బానిసలు చేసి, ప్రభుత్వాలు మళ్లీ ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తున్నాయని. ఇది భయంకరమైన నిజమని అన్నారు. పేద ప్రజలకు విద్య, వైద్యం మాత్రమే ఉచితంగా అందించాలని, మిగిలినవి ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఉచిత పథకాలు ఇవ్వడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆలోచించాలన్నారు. ఉచిత పథకాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి, అప్పుల ఊబిలోకి రాష్ట్రాలను నెట్టేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతే కాదు పార్టీ ఫిరాయింపులను కూడా ప్రోత్సహించకూడదు. ఎవరైనా పార్టీ మారాలనుకుంటే పార్టీ ద్వారా పొందిన పదవులకు రాజీనామా చేయాలన్నారు.
పట్టుబడ్డ డిజిటల్ అరెస్ట్ ముఠా
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్
