ఇంగ్లండ్ మాజీ ఫుట్‌బాల్ కెప్టెన్ సర్ డేవిడ్ బెక్‌హమ్ సర్కార్ బడిలో సందడి చేశారు. యూనిసెఫ్ గుడ్ విల్ ప్రచారకర్తగా ఉన్న డేవిడ్ బెక్‌హమ్ విశాఖపట్నం జిల్లా, కొత్తవలసలోని మహాత్మా జ్యోతిబా ఫూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ విద్యాసంస్థల సొసైటీ బాలికల రెసిడిన్షియల్ పాఠశాలను బుధవారం సందర్శించారు. ఈ స్కూల్లో అమలు చేస్తున్న ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్‌ను పరిశీలించారు. యూనిసెఫ్ గుడ్ విల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎడ్యుకేషన్ ఎబౌ ఆల్, మంత్ర4ఛేంజ్ కార్యక్రమంలో భాగంగా డేవిడ్ బెక్‌హమ్ భారత పర్యటనకు వచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్, బీహార్, ఒడిశా, నాగాలాండ్‌లోని ప్రభుత్వ పాఠశాల పనితీరును మెరుగుపరుస్తున్నారు. కొత్తవలసలోని రెసిడెన్షియల్ స్కూల్‌ను సందర్శించిన ఆయన.. దాదాపు నాలుగు గంటల పాటు విద్యార్థులు, టీచర్లతో సరదాగా గడిపారు. తరగతి గదుల్లో కూర్చొని టీచర్ల బోధన తీరును పరీక్షించారు. విద్యార్థుల సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లిష్ ప్రాజెక్టులను పరిశీలించారు. విద్యార్థులతో మొక్కలు నాటారు. స్కూల్ లైబ్రరీని సందర్శించి పిల్లలకు ఇష్టమైన పుస్తకాల గురించి తెలుసుకున్నారు. చివర్లో విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ ఆడారు. ఈ పాఠశాల సందర్శనను ఉద్దేశించి బెక్ హమ్ తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ‘భారత్‌లో నాకు ఇది అద్భుతమైన రోజు. ఎడ్యుకేషన్ ఎబౌ ఆల్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ కార్యక్రమాలకు మద్దతుగా పాఠశాలను సందర్శించడం చాలా సరదాగా ఉంది.’
ఏపీ సర్కార్ బడిలో బెక్‌హమ్
5
previous post
