తమ అద్వితీయమైన ప్రదర్శనతోనే భారత గడ్డపై టెస్ట్ సిరీస్‌ను గెలిచామని సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా తెలిపాడు. ముఖ్యంగా సైమన్ హర్మర్ ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడని కొనియాడాడు. మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన టెంబా బావుమా సమష్టి ప్రదర్శనతోనే ఈ గొప్ప విజయాన్ని అందుకున్నామని తెలిపారు. ‘ఇది చాలా పెద్ద విజయం. వ్యక్తిగతంగా ఈ గెలుపు నాకు చాలా సంతోషాన్నిచ్చింది. గాయం కారణంగా కొన్ని నెలల పాటు నేను ఆటకు దూరమయ్యాను. రీఎంట్రీ ఇచ్చిన తొలి సిరీస్‌లోనే విజయన్నందుకు కోవడం గొప్ప అనుభూతినిచ్చింది. భారత గడ్డపై 2-0తో టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయడం అంత సులువు కాదు. ఈ గెలుపు క్రెడిట్ మాదే. ఈ సిరీస్‌లో మా ఆలోచన విధానంలో చాలా మార్పు వచ్చింది. మైదానంలో సత్తా చాటి జట్టుకు సహకారం అందించడానికి మా సన్నద్దత అనేది మరో అంశం. జట్టులోని ప్రతీ ఒక్కరు జట్టు కోసం కష్టపడుతున్నారు. మేం ఉన్నామనే భరోసా కల్పిస్తున్నారు. జట్టుగా మేం మంచి స్థితిలో ఉన్నాం. ఈ విజయం మా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. జట్టులోని ప్రతీ ఒక్కరు విజయంలో కీలక పాత్ర పోషించాలనే తపనతో ఉన్నారు. ఈ సిరీస్‌లో ప్రతీ ఒక్కరు రాణించారు. భారీ శతకాలు సాధించలేకపోయినా.. విజయానికి కావాల్సిన పరుగులు చేశారు. ముఖ్యంగా నలుగురు, ఐదుగురు అసాధారణ ప్రదర్శన కనబర్చారు. నా జట్టు గురించి ఎంత చెప్పినా తక్కువే. సైమన్ హర్మర్ ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతను 2015లోనూ భారత పర్యటనకు వచ్చాడు. ఇక్కడ ఆడిన అనుభవం అతనికి ఉంది. కేశవ్ మహరాజ్‌కు గొప్ప సహకారం అందించారు. బంతిపై అతనికి మంచి నైపుణ్యం ఉంది. వారిని కాదని మరో బౌలర్‌కు బంతిని ఇవ్వలేకపోతున్నా. ఈ సిరీస్‌లో సైమర్ హర్మర్ మా మ్యాచ్ విన్నర్’అని చేర్చాడు.
మా ఫ్యామిలీ కలిసిపోవాలి: మంచు లక్ష్మి
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్
