ఓజీతో హిట్ అందుకున్న హీరోయిన్ ప్రియాంక మోహన్.. సినిమాల విషయంలో కటువుగా ప్రవర్తిస్తోందట. సినిమా చేయాలంటే కొన్ని కండీషన్స్ పెడుతుందట. పాత్ర ప్రాధాన్యత ఉంటేనే చేస్తా అంటుందట. అంతేకాదు.. గ్లామర్ షోతో పాటు లిప్ లాక్స్, ఇంటిమెట్ సీన్స్ లాంటివి ఉంటే వెంటనే నో చెప్పేస్తుందట. ట్రెడిషనల్ రోల్స్.. అది కూడా కథ నచ్చితేనే చేస్తానని తెగేసి చెప్తోందట. గ్లామర్‌తో పనిలేకుండా కంటెంట్ ఉన్న సినిమాలు చేసే హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని ప్రియాంక మోహన్ కూడా కెరీర్ ముందుకు సాగాలి అంతేకానీ వచ్చిన ప్రాజెక్ట్ కి అది ఇది అని చెప్పి వదిలేస్తే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తోందన్న విషయం ఆమెకు ఎవరైనా చెప్పాలని విశ్లేషకులు అంటున్నారు.
ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్
