సౌతాఫ్రికాతో ఘోర పరాజయం అనంతరం డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో భారత్ స్థానం దిగజారింది. దాయాదీ పాకిస్థాన్ కంటే భారత్ స్థానం కిందకు పడిపోయింది. సౌతాఫ్రికాతో బుధవారం ముగిసిన రెండో టెస్ట్‌లో రిషభ్ పంత్ సారథ్యంలో భారత జట్టు 408 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ ఘోర పరాజయంతో రెండు టెస్ట్‌ల సిరీస్‌ను 2-0తో కోల్పోయింది. 25 ఏళ్ల తర్వాత భారత గడ్డపై సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. 93 ఏళ్ల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో సొంతగడ్డపై ఇది మూడో క్లీన్ స్వీప్ కాగా.. వరుసగా రెండోది. ఈ రెండు పరాజయాలు కూడా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలోనే ఎదురు కావడం భారత టెస్ట్ క్రికెట్ భవిష్యత్తుపై ఆందోళన రేకెత్తిస్తోంది. తాజా పరాజయంతో డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో గరిష్టంగా ఐదో స్థానానికి పడిపోయింది. అగ్రస్థానంలో ఆస్ట్రేలియా కొనసాగుతుండగా.. సౌతాఫ్రికా రెండో స్థానంలో నిలిచింది. శ్రీలంక, పాకిస్థాన్ భారత్ కంటే ముందున్నాయి.
పాకిస్థాన్ కంటే దిగజారిన భారత్
4
previous post
