బీసీలకు కాంగ్రెస్ ధోకాబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్వరంగల్, నవంబర్ 26 (ఈవార్తలు): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, ఉన్న 24 శాతం నుంచి 17 శాతం తగ్గించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రిజర్వేషన్ల తగ్గింపు, ప్రజాధనం దుర్వినియోగంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో కులగణన దేశానికి ఆదర్శమని రాహుల్ గాంధీ అన్నారని, కానీ ఇప్పుడున్న రిజర్వేషన్లు కూడా తగ్గించారని. కేటీఆర్ ఈరోజు వరంగల్ జిల్లాలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వరంగల్ జిల్లా అంటేనే పత్తి పంటకు, అజంజాహీ మిల్లుకు పేరుగాంచిందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ జిల్లా పూర్వవైభవం కోల్పోయిందని అన్నారు. అలాంటి వరంగల్ జిల్లాలో కేసీఆర్ అతిపెద్ద టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వరంగల్‌కు మళ్లీ టెక్స్టైల్ హబ్ గుర్తింపు తెచ్చిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్‌లో ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేస్తోందని కేటీఆర్. 9,300 ఎకరాల పారిశ్రామిక భూములను విక్రయించి, రాహుల్ గాంధీకి తెలంగాణను ఏటీఎంగా చూస్తున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్ నగరం లోపల ఉండే కాలుష్య కారక పరిశ్రమలను, ఫార్మా పరిశ్రమను తరలించడానికి ఫార్మా సిటీని తమ ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి రూ.5 లక్షల కోట్ల భూకుంభకోణానికి కనిపించాలని చూస్తున్నారని. దీనిని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.పల్లాను లాగేందుకు కాంగ్రెస్ కుట్రజనగామ, నవంబర్ 26 (ఈవార్తలు): జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువెళ్లడానికి ఎన్నో ఒత్తిళ్లు వచ్చినా, ఆయన తాను నమ్ముతున్న నాయకుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు. జనగామ బీఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల జిల్లాఆర్ ఉంటుంది.
42 అని.. 17 చేశారు!
6
previous post
